370 ఆర్టికల్ రద్దు పై ఉదయం నుంచి రాజ్యసభలో చర్చ జరిగింది. దీని పై చివర్లో అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్, ఇది హడావిడిగా పెట్టిన బిల ని, కనీసం టైం కూడా ఇవ్వకుండా, ఇంత హడావిడిగా చెయ్యాల్సిన అవసరం ఏంటి, మంద బలంతో బుల్ డోజ్ చేస్తారా అంటూ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అయితే, దీని పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభజన సమయంలో, అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలా ప్రవర్తించిందో వివరించారు. అప్పట్లో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడకుండా, బిల్ పెట్టి, రెండు రాష్ట్రాలుగా విడగొట్టారని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
అయితే దీని పై గులాం నబీ ఆజాద్ అభ్యంతరం చెప్పారు. దీనికి సమాధానం చెప్పాలి అంటూ, అమిత్ షా స్పీచ్ ని ఆపి, తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అమిత్ షా మాటలకు సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభజన ఇలా జరగలేదు అని చెప్పారు. అంతకు ముందే అందరితో మాట్లాడామని, ఆ ప్రక్రియ అంతా సంవత్సరం పాటు నడిచిందని చెప్పారు. ఇరు ప్రాంతాల వారిని పిలిచి దాదపుగా 20 మీటింగ్స్ పెట్టామని, దానికి నేనే సాక్ష్యం అంటూ ఆజాద్ చెప్పుకొచ్చారు. అఖిల పక్షం పెట్టం, ప్రజా సంఘాలని పిలిచాం, అన్నీ చేసి పార్లమెంట్ కు వస్తే, ఇక్కడ ఎంపీలు గొడవ చేసారని, అప్పుడు మీరు కూడా మద్దతు ఇచ్చారు కదా అని ఆజాద్ అన్నారు. మేమేమి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని, అందరితో చర్చించామని అన్నారు.
ఈ రోజు ఏమి జరుగుతుందో దేశానికి చెప్పకుండా, ఇప్పటికిప్పుడు రాజ్యసభలో మీరు ప్రకటన చేసారని, ఇది ఏకపక్షం కాక, ఇంకా ఏమిటని ప్రశ్నించారు. కాశ్మీర్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, రాష్ట్రాన్ని ఎలా విడగోడతారని అన్నారు. అయితే దీని పై అమిత్ షా కూడా అదే రేంజ్ లో సమాధానం చెప్పారు. మేము ఈ బిల్ పై ఏమి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తాము మున్సిపాలిటీల్లో గెలవక ముందు కూడా ఈ అంశం పై చర్చించామని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు అంశం మా మేనిఫెస్టోలో కూడా ఉందనే విషయం మర్చిపోకూడదు అని అన్నారు. అయితే ఇరువురి వాదనలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల విభజన పై జరుగుతూ ఉండటంతో, వెంకయ్య నాయుడు, ఇద్దరినీ వాదించారు. ఇక్కడ ఏపి, తెలంగాణా చర్చ కాదని, ఆర్టికల్ 360 పై మాట్లాడాలని అన్నారు. మరో పక్క, జమ్మూకశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.