ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తాను అంటూ జగన్ మోహన్ రెడ్డి విధానం పై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మద్య నిషేధం చాలా కష్టమైన పని చెప్తూ, తెలంగాణా ఉద్యమం నాటి సమయంలో జరిగిన కొన్ని అంశాలకు ఉదాహరణగా చెపారు. అయితే దీని పై టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. తెలంగాణా సాయుధ పోరాటాన్ని పవన్ కళ్యాణ్ కించ పరుస్తూన్నరు అంటూ, హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం ముందు నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేసారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవలాని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని అని చెప్తూ, జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ అంశం పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా చిన్న అంశం అని, దాన్ని కావాలని టీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తాను ఒక మాట అంటే, తాను అనని మాటలకు వక్రభాష్యం చెప్పి, తన ఇంటిమీద, కార్యాలయాల మీద దాడులు చెయ్యటం ఏంటని టీఆర్ఎస్ ని ప్రశ్నించారు. ఏమి లేని దానికి తన ఇంటి మీద దాడులు చెయ్యటానికి వస్తే, చూస్తూ కూర్చోను అని, తాట తీస్తానని హెచ్చరించారు. తాను ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదని, ఎవరినీ కించపరచలేదని, అలా చెప్తే తాను వెంటనే క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని పవన్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాగే అయిన దానికి కాని దానికి రాద్ధాంతం చేస్తే, పరిణామాలు వేరే లాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
తన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, మీ ఇష్టం వచ్చినట్టు నా ఇంటి ముందు చేస్తే, చూస్తూ కూర్చోను అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇళ్ళ మీదకు వస్తాం, ఆఫీసుల మీదకు వస్తాం అంటూ, మేమేమి ముడుచుకు కుర్చోలేదని పవన్ అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ అంశం పై స్పందించారు. తాను నిన్న రాజమండ్రిలో దిగగానే, ఫోన్ వచ్చిందని, తన ఇంటి ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారని అన్నారు. ఎందుకు అని అరా తీస్తే, నేను తెలంగాణా పోరాటాన్ని కించ పరిచేలా మాట్లాడానని, అందుకని అని అన్నారని పవన్ అన్నారు. ఎప్పుడో ఐదు రోజుల క్రిందట నేను ఎదో మాట్లాడితే, వీళ్ళు ఏదో ఆపాదించుకు హడావిడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. నా భీమవరం పర్యటన హైలైట్ కాకుండా, ఇలా చేసారని అన్నారు.