బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రెండు రోజుల క్రిందట, పోలవరం ప్రాజెక్ట్ టెండర్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చెయ్యటం పై, ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై వైసీపీ నేతలు వెంటనే సుజనాకి కౌంటర్ ఇచ్చారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో, జగన్ ప్రభుత్వాన్ని తిట్టినా పట్టించుకోని వైసీపీ నేతలు, రాష్ట్రంలో బీజేపీ నేతలు తిడుతుంటే పట్టించుకోని వైసీపీ నేతలు, సుజనా విమర్శ చెయ్యగానే అందరూ ఆక్టివ్ అయిపోయారు. అయితే సుజనా తెలుగుదేశం పార్టీ మారి రెండు నెలలు అవుతుంది. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీ అయిపోయారు. అయితే సుజనా విమర్శల పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ, సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయినా ఇంకా తెలుగుదేశం అధికార ప్రతినిధి లాగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.

sujana 06082019 2

పోలవరం ప్రాజెక్ట్ టెండర్ రద్దు చెయ్యటం, విద్యుత్ పీపీఏలను సమీక్షించటం పై, కేంద్రం తప్పుబట్టింది అంట, ప్రజాధనం లూటి చేసిన దాన్ని సమర్ధించటం చూస్తే, ఇంకా సుజనా చౌదరి లోపల పచ్చ చొక్కా వేసుకుని తిరుగుతున్నారు అనిపిస్తుంది అంటూ, సుజనా పై విమర్శలు చేసారు. అయితే ఇలాంటి వారిని అసలు పెద్దగా పట్టించుకోని సుజనా, అనూహ్యంగా విజయసాయి రెడ్డికి రియాక్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి పై విమర్శలు ఎక్కు పెడుతూ, "పోలవరం ఆపెయ్యడం, పీపీఏలను రద్దుచెయ్యాలనుకోవడం రాష్ట్రప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని @VSReddy_MP గారికి తెలుసు. ఇలాంటి చర్యలను అడ్డుకోకపోతే రాష్ట్రానికి నష్టమని తెలుసు. కాని ఆయన అసలు అభిప్రాయం చెప్పలేని నిస్సహాయునిగా ఉన్నట్టున్నారు. అది కప్పిపుచ్చుకోడానికే ఇలాంటి ట్వీట్లు." అంటూ సమాధానం చెప్పారు.

sujana 06082019 3

రెండు రోజుల క్రిందట సుజనా చౌదరి మాట్లాడుతూ, పోలవరం టెండర్ ను రద్దు చెయ్యటం పై, కేంద్రంలోని పెద్దలు అందరూ అవాక్కయ్యారని అన్నారు. ఇదే విషయం పై కేంద్ర మంత్రితో చర్చించామని, పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం ప్రాజెక్ట్ అని, దీని పై సమీక్ష జరుపుతాం అని చెప్పారని సుజనా చెప్పారు. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన మోహన్ రెడ్డి దూకూడుగా వెళ్తున్నారని, ఇంత మంది వారిస్తున్నా, ఆయన మాత్రం ఆయన పంధాలోనే వెళ్తున్నారని, దీని వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు రాష్ట్రానికి రాకుండా పోతాయని అన్నారు. అలాగే స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ పై కూడా, అభ్యంతరం చెప్తూ, మన రాజ్యంగం ప్రకారం ఇది చెల్లదని, దేశంలో ఎవరు ఎక్కడైనా పని చెయ్యొచ్చని అని అన్నారు. దీని పై విజయసాయి అభ్యంతరం చెప్పటం, దానికి సుజనా కౌంటర్ ఇవ్వటం జరిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read