వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో, గాలి జనార్ధన్ రెడ్డిని నా పెద్ద కొడుకు అని చెప్పే వారు. అలాగే గాలి జనార్ధన్ రెడ్డికి, ఓబులాపురంలో గనులు కేటాయించి తవ్వుకోమన్నారు. చివరకు అది పెద్ద స్కాం అయింది. ఓబులాపురం మైనింగ్ లో, గాలి జనార్ధన్ రెడ్డి పిచ్చ పీకుడు పీకారు. చివరకు బంగారపు సింహాసనం కూడా చేపించుకుని, దాని పై కూర్చునే వారు కూడా. సిబిఐ మొదటి సారి దాడులుకు వెళ్ళినపుడు, ఇవన్నీ చూసి షాక్ అయ్యారు. 2007లో ఓబులాపురం మైనింగ్ పై, సిబిఐ కేసు పెట్టింది. అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి, చాలా ఏళ్ళు జైల్లో కూడా ఉన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి కేసు తరువాత, జగన్ కేసులు కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి హయంలో, అవినీతి చేసారని కేసులు నమోదు అయ్యాయి.

ed 22072019 2

తరువాత కాలంలో ఇద్దరికీ బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే కాలం కలిసి వచ్చి, జగన్ ఏకంగా సియం అయిపోయారు. గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం, బీజేపీ పార్టీలో ఆయన ఉండటంతో, ఆయన పై కేసులు కొంచెం స్లో అయ్యాయి అనే భావన అందరికీ కలిగింది. ఇప్పటికి కేసు పెట్టి 12 ఏళ్ళు అయినా, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో, బీజేపీ వ్యవహరించిన తీరుతో, మళ్ళీ గాలి జనార్ధన్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయిని అందరూ అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కాని, మళ్ళీ గాలి జనార్ధన్ రెడ్డి పై విచారణ మొదలైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డికి షాక్ ఇస్తూ, ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని ఆదేశించారు.

ed 22072019 3

దీంతో గాలి జనార్ధన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి జనార్ధన్ రెడ్డి పై ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విదేశాలకు పెద్ద ఎత్తున తరలించిన నగదు పై, గాలి జనార్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం సిబిఐ విచారణకు మాత్రమే హాజరయిన గాలి జనార్ధన్ రెడ్డి, మొదటి సారి ఈడీ ముందుకు రావటంతో, ఏమి జరుగుతుందా అనే సస్పెన్స్ నెలకొంది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీ అరుణకు కూడా ఈడీ నోటీసులు జారీచేసింది. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. అయితే సిబిఐ కాకుండా, ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగటం చూస్తుంటే, మళ్ళీ గాలి అండ్ కో కి బ్యాడ్ డేస్ ఏమైనా మొదలయ్యయా అనే వాదన మొదలైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read