రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు గుర్తుందా ? చంద్రబాబు నువ్వు మాట్లాడితే 40 ఏళ్ళు అనుభవం ఉంది అని డబ్బా కొట్టుకుంటావ్, ఏంటయ్యా నీ అనుభవం. నీ అనుభవంతో, నువ్వు నలుగురుకి అయినా రోల్ మోడల్ అయ్యావా అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్న పై తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబుని అభిమానించే వారు, సోషల్ మీడియాలో స్పందిస్తూ, సిబిఎన్ ఈజ్ మై రోల్ మోడల్ అంటూ, హాష్ ట్యాగ్ తో, దాదపుగా 20 వేల పోస్ట్ లు వేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఎంతో మంది దేశాధినేతలు, కార్పొరేట్ దిగ్గజాలు చంద్రబాబు పై ప్రశంసలు కురిపించిన వీడియోలు ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంక్ కూడా చంద్రబాబువిధానాలను పొగిడింది.

worldbak 21072019 1

ఈ రోజు ప్రపంచ బ్యాంక్, అమరావతికి ఎందుకు రుణం ఇవ్వలేకపోయామో చెప్తూ, ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ప్రతిపాదన వెనక్కు తీసుకుందని, అందుకే ఇవ్వలేక పోయాం అని చెప్పింది. అయితే ఈ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ తో ప్రపంచ బ్యాంక్ కు ఉన్న సంబంధాల పై వివరించింది. ఎప్పటి లాగే, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, ప్రకృతి వైపరీత్యాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందిస్తామని చెప్పింది. అలాగే మరొక్క విషయం కూడా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాల వ్యవస్థతో పని చెయ్యటం మాకు ఎంతో గర్వ కారణం అని, ఈ వ్యవస్థను మిగతా దేశాలు కూడా అనుసరించాయని చెప్పింది. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మహిళలకు సాధికారత కల్పించాలని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

worldbak 21072019 1

అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం అయ్యింది. అదే విషయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మరోసారి గుర్తు చేసింది. డైరెక్ట్ గా చంద్రబాబు పేరు రాయకపోయినా, ఆంధ్రప్రదేశ్ అనుసరించిన ఈ విధానం, ఎన్నో దేశాలకు మార్గదర్శకం అని చెప్పింది. రెండు రోజుల క్రితం నువ్వు ఎవరికీ రోల్ మోడల్ అని అడిగిన జగన్ గారికి ఇక్కడ సమాధానం దొరికే ఉంటుంది. చంద్రబాబు గారి విధానాలు, ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ అని ఏకంగా ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ఇది వారి ప్రకటనలో చెప్పింది. "The World Bank has had a long and productive partnership with the state of Andhra Pradesh. The state has pioneered some remarkable development innovations, such as the women’s self-help group movement, that other countries have learned from."

Advertisements

Advertisements

Latest Articles

Most Read