ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడుకు... ఈ డైలాగులు గుర్తున్నాయా ? మన జగన్ మోహన్ రెడ్డి గారు, పాదయాత్ర సందర్భంగా హామీలు ఇస్తూ, ఇలా సంబోధించి, ప్రజలను ఆకట్టుకున్నే వారు. ఈ క్రమంలోనే, అక్టోబర్ 17 2017న, అనంతపురం జిల్లాలో, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వారికి, 45 ఏళ్ళకే, రెండు వేలు పెన్షన్ ఇస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి వైఎస్ఆర్ చేయూత పధకం అని పేరు పెట్టానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వారు, ఎన్నో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారని, వారికి 45 ఏళ్ళు వచ్చే సరికే ఎముకలు అరిగిపోయి, సరిగ్గా పని చేసుకోలేక పోతున్నారని, నా పాదయాత్రలో ఇది గమనించిన తరువాత, 45 ఏళ్ళకే, రెండు వేల పెన్షన్ ఇస్తున్నని, జగన్ మోహన్ రెడ్డి, అనేక సార్లు చెప్పారు.
ఇది పెద్ద సంచలనం అయ్యింది కూడా. 45 ఏళ్ళకే పెన్షన్ అంటే మామూలు విషయమా అంటూ, ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. చాలా మంది ఆకర్షితులు అయ్యారు. మా జగనన్న మాట ఇస్తే మడం తప్పడు, 45 ఏళ్ళకే పెన్షన్ అంటూ, వైసిపీ నేతలు, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, ఊరు ఊరా ప్రచారం చేసారు. ప్రజలు కూడా ఇది బాగా రిసీవ్ చేసుకున్నారు. చంద్రబాబు అయితే 60 ఏళ్ళకు ఇస్తాడు, మా జగన్ అన్న అయితే, 45 ఏళ్ళకే ఇస్తాడు అని సంబర పడ్డారు. అయితే, జగన్ మాత్రం, తరువాత మాట మర్చి, 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాను అంటూ పధకం మారింది అని చెప్పారు. ఇది మాత్రం, ఎక్కడా పెద్దగా ప్రచారం చెయ్యలేదు. 45 ఏళ్ళకే 2 వేలు పెన్షన్ అనేది ప్రచారం చేసి చేసి, మ్యానిఫెస్టో లో మాత్రం, 4 ఏళ్ళలో 75 వేలు అని పెట్టారు. కాని అమాయక ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వారు మాత్రం, 45 ఏళ్ళకే 2 వేలు పెన్షన్ అనే భ్రమలో ఉన్నారు.
ఈ రోజు ఇదే విషయం పై, తెలుగుదేశం పార్టీ సభ్యులు, సభలో ప్రశ్న వేసారు. మీరు 45 ఏళ్ళకే ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వారికి, రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పారు కదా, ఊరు ఊరా ప్రచారం చేసారు కదా, ఎప్పటి నుంచి వారికి ఇస్తున్నారు అని ప్రశ్నించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, నేను ఎక్కడ చెప్పాను, నేను చెప్పింది, 4 ఏళ్ళలో 75 వేలు అని, ఆ వీడియో ప్లే చేసారు. నేను మాట ఇస్తే తప్పను, మా వంశం అంత గొప్పది అని చెప్పారు. అయితే, 45 ఏళ్ళకే 2 వేలు పెన్షన్ అనేది మాత్రం మర్చిపోయారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు, దీని పై అభ్యంతరం చెప్తూ, మేము ఇచ్చే వీడియో కూడా అసెంబ్లీలో వెయ్యాలని కోరారు. అయితే, ఇది తట్టుకోలేని అధికార పక్షం, ఇంకా చాలా బిల్లులు ఉన్నాయని, వీళ్ళు ఇలాగే గోల చేస్తారు, వీరిని సస్పెండ్ చెయ్యండి అంటూ, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును, సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెండ్ చేసారు. మీరు చెప్పిన హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అని ప్రజల తరుపున అడిగినందుకు, తెలుగుదేశం సబ్యులకు జరిగిన శాస్తి ఇది. బహుసా రాజన్న రాజ్యం అంటే ఇదేనేమో..