ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు అమరావతి రుణం పై జరిగిన చర్చలో, జగన్ ప్రభుత్వం అమరావతి పై చూపిస్తున్న వివక్ష పై చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ తీసుకునే ప్రతి చర్య అమరావతికి నష్టం చేసి, హైదరాబాద్ కి లాభం అయ్యేలా ఉన్నాయని అన్నారు. అంతే కాదు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఛాలెంజ్ చేసారు. అమరావతి పై జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్య సరైనదే ఇక్కడ రైతులు ఎవరు చెప్పినా సరే, నేను దేనికైనా సిద్ధం అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేసారు. దేనికైనా సిద్ధమని, ఇక్కడ రైతుల చేత జగన్ చేసేది కరెక్ట్, నేను చేసింది తప్పు అని చెప్పేస్తే, దేనికైనా, ఎటువంటి శిక్షకు అయినా నేను సిద్ధం అని చంద్రబాబు ఆవేదనతో మాట్లాడారు. ఈ రోజు కూడా అమరావతిని భ్రమరావతి అంటూ హేళన చేస్తున్నారని అన్నారు.
గతంలో వైసిపీ నేతలు అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ ప్రపంచ బ్యాంక్ కు లేఖలు మీద లేఖలు రాసారని, ఇప్పుడు అదే వారి మెడకు చుట్టుకుందని అన్నారు. వీరు అధికారంలోకి రాగానే, అమరావతి రుణం ఇవ్వం అని చెప్పారని, అన్నారు. అమరావతి నిర్మాణానికి అడుగడుగునా జగన్ అడ్డు అడ్డారాని అన్నారు. ఇక్కడ రైతులు రెచ్చగొట్టటం మొదలు, పంట పొలాలు నిప్పు పెట్టటం, వంటివి ఎన్నో చేసారని అన్నారు. రైతులకు ఇవ్వగా, ప్రభుత్వానికి మిగిలేది 7 వేల ఎకరాలని, ఆ భూమితో అమరావతి ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యొచ్చ అని అన్నారు. అలాంటి బంగారమైన అవకాసం, వీళ్ళు చేతులారా నాశనం చేసారని అనంరు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు మనకు వద్దా అని చంద్రబాబు అన్నారు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, రాజధాని భూములు రేట్లు ఎలా పడిపోయాయో చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి వారికే అర్ధం కావటం లేదని, వారి భవిష్యత్తు ఏంటా అని దిగులు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. అమరావతి రుణం ఇవ్వటం కోసం గతంలో ప్రపంచ బ్యాంక్ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు తీసుకున్నారని అన్నారు. అమరావతి పై జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దుర్మార్గమైన నిర్ణయాల కారణంగా,కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసిందని అన్నారు. మరో పక్క బుగ్గన చెప్పిన అబద్ధాలను కూడా చంద్రబాబు కడిగేసారు. హెల్త్ ప్రాజెక్ట్ కు లోన్ మా ప్రభుత్వంలో సాంక్షన్ అయితే, వీరి వల్ల వచ్చింది అంటూ, హడావిడి చేస్తున్నారని, ఇలా ప్రజలను మభ్యపెట్టలేరని చంద్రబాబు అన్నారు.