మొన్నటి ఎన్నికల్లో చట్టా పట్టాల్ వేసుకుని తిరిగి, చంద్రబాబుని ఓడించిన, వైసిపీ, బీజేపీ మధ్య రోజు రోజుకీ గ్యాప్ పెరిగిపోతుంది. అచ్చం చంద్రబాబుకి ఎలా చేసారో, ఇలాగే జగన్ కు ఎర్త్ పెడుతుంది బీజేపీ. కాకపొతే చంద్రబాబుతో రెండేళ్ళ వరకూ బాగానే ఉండి, తరువాత ట్యూన్ మార్చారు, జగన్ కు మాత్రం రెండు నెలలకే ట్యూన్ మార్చారు. చంద్రబాబుని ఎదుర్కోవాలి అంటే, చాలా కష్టం కాబట్టి, ఎన్నో వ్యూహాలు, ఆపసోపాలు పడి, టార్గెట్ పూర్తీ చేసింది. అయితే జగన్ కు మాత్రం, ఇలాంటి వ్యూహాలు, పెద్దగా అవసరం లేదు. జగన్ రాజకీయ జీవితం ఫినిష్ చెయ్యాలి అంటే, అమిత్ షా కు 24 గంటలు చాలు. శశికళ ఎపిసోడ్ అదే చెప్తుంది. కాని ఇప్పుడే అక్కడి దాకా వెళ్ళే పరిస్థితి లేదు. జగన్ కూడా అణిగిమణిగి ఉంటున్నాడు కాబట్టి, బీజేపీకి ఆ రూట్ ప్రస్తుతానికి అవసరం లేదు. అందుకే రాజకీయంగా విమర్శల దాడి మొదలు పెట్టింది. గత నాలుగు రోజులుగా బీజేపీ విమర్శలు చూస్తుంటే, వాళ్ళ లైన్ అఫ్ ఎటాక్ ఎంతో ఇట్టే అర్ధమై పోతుంది.
నిజానికి ముందుగా తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేసేద్దాం అని బీజేపీ ప్లాన్ వేసింది. ఇందుకు తగ్గట్టే ముందుగా వ్యాపారాలు ఉన్న నేతలను బెదిరించి, నలుగురు రాజ్యసభ ఎంపీలను లాక్కుంది. అయితే అప్పటి నుంచి ఒక్క చెప్పుకో తగ్గ నేత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను లాగుదాం అనుకున్నారు కాని, 23 మందిలో చాలా వారకు పార్టీతో ఉండేవారే. ఒకరో ఇద్దరో వెళ్తారు అనుకున్నా, జగన్ పెట్టిన కండీషన్ ప్రకారం, పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్ళాలి. దీంతో ఎమ్మెల్యేలను లాక్కోవలనే ప్లాన్, బీజేపీకి వర్క్ అవ్వలేదు. అందుకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వదిలేసి, ఏకంగా జగన్ పైనే గురి పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి అవినీతి పాలన, కుల పాలన, మత పాలన చేస్తున్నారని బీజేపీ టార్గెట్ చేసింది. విశాఖలో చర్చిలకు భద్రత అంశం బీజేపీకి కలిసి వచ్చింది.
ఈ అంశం పై పురందేశ్వరి గట్టిగా పోరాడుతున్నారు. ఇక గ్రామాల్లో శాంతి భద్రతలు లేవని, పోలీస్ రాజ్యం నడుస్తుంది అని కన్నా లక్ష్మీ నారాయణ ఎత్తుకున్నారు. అలాగే జగన్ 40 రోజుల్లోనే అవినీతి మయం చేసారని, ఎమ్మెల్సీ మాధవ్ అంటున్నారు. ఇక రాయలసీమను పట్టించుకోవటం లేదని, మరికొందరు బీజేపీ నాయుకులు అంటున్నారు. మరో పక్క, అన్ని ప్రాధాన పోస్టింగ్ లు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం పై కూడా, బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మొత్తానికి, కులం, మతం, అవినీతి, రాయలసీమ అజెండాగా, బీజేపీ తన లైన్ అఫ్ ఎటాక్ ని జగన్ పై చూపించబోతుందని అర్ధమవుతుంది. బీజేపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తీ కాగానే, జగన్ ప్రభుత్వం పై ఆందోళనలకు సిద్ధం అవుతుంది. అయితే, బీజేపీ ఇన్ని విమర్శలు చేస్తున్నా, జగన్ క్యాంప్ వైపు నుంచి మాత్రం, ఒక్కటంటే ఒక్క రివర్స్ కౌంటర్ బీజేపీ పై లేదు. ఎందుకో అందరికీ తెలిసిందేగా..