గత రెండు నెలల నుంచి జగన్ మొహన్ రెడ్డికి ఒకే ఒక టార్గెట్. చంద్రబాబుని ఎదో ఒక అవినీతి కేసులో ఇరికించాలి. దీని కోసం జగన్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సెక్రటేరియట్ కు వెళ్ళిన మొదటి రోజే, అక్కడి ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన అవినీతి ఉంటె చెప్పండి, మిమ్మల్ని సన్మానిస్తాం అని. ఇప్పటికి రెండు నెలలు అయినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇక తన పరిధిలో అన్ని ఫైల్స్ తిరగేస్తున్నారు. చంద్రబాబు పై చాలా కమిషన్ లు వేసారు. మరో 15 రోజుల్లో మొత్తం బయట పెడతా అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే కోవలతో చంద్రబాబు హయంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాల పై జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎవరు చెప్పారో కాని, ఈ విషయం మాత్రం వదిలి పెట్టటం లేదు. అటు కేంద్రం కూడా , ఈ విషయంలో రెండు లేఖలు రాసింది.
విద్యుత్ ఒప్పందాలు, రెగ్యులేటరీ కమిషన్ చేస్తుందని, దీంట్లో అవినీతి ఆస్కారం ఉండదని, పెట్టుబడిదారులను భయపెట్టద్దు అని వార్నింగ్ ఇచ్చింది. అయినా జగన్ ఎదో జరిగి పోయింది అనే భ్రమలో ముందుకే వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నామని, ఈ సమీక్షకు హాజరుకావాలని, ఒప్పందాలు చేసుకున్న అన్ని విద్యుత్ కంపెనీలను ప్రభుత్వం సమీక్షకు ఆహ్వానించింది. వీరందిరనీ వెలగపూడి సచివాలయాని రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే, ఈ సమీక్షకు మేము హాజరు కావటం లేదని, కేంద్ర సంస్థలు అయిన, ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకుంటూ, వారి నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపాయి. అంతే కాదు, జగన్ ప్రభుత్వం ఇలాగే మొండిగా వెళ్తే, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
మా ఒప్పందాలు కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ప్రైవేటు కంపెనీ అయిన గ్రీన్ కో, ప్రభుత్వ వైఖరి పై ట్రిబ్యునల్ కు వెళ్ళటంతో, జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టి, ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి అటు కేంద్రం కాని, ఇటు బిజినెస్ వర్గాలు, ఫిచ్ రేటింగ్స్, ఇలా అనేక మంది హెచ్చరికలు జారీ చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని, పెట్టుబడి దారులు వెళ్లిపోతారని, హెచ్చరించారు. ఎవరు ఎన్ని చెప్పినా, జగన్ మాత్రం, నేను సమీక్ష చేస్తాను, ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు అనే ధోరణిలో, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే జగన్ ప్రభుత్వానికి పవర్ షాక్ తప్పదేమో ?