అమరావతి నిర్మాణం కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం, రుణం ఇవ్వాలి అంటూ ప్రపంచ బ్యాంక్ ను కోరిన విషయం తెలిసిందే. దాని పై నిర్ణయం తీసుకుంటూ, మేము రుణం ఇవ్వలేం అంటూ తాజాగా ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అయితే దీని పై ఎవరి వాదన వారిదిగా ఉంది. చంద్రబాబు వల్లే రుణం రాలేదని జగన్ ప్రభుత్వం అంటుంది. కొంత మంది మాత్రం, అమరావతిలో ఉండే కొంత మంది కంప్లైంట్ ఇవ్వటం వల్ల రాలేదు అంటున్నారు. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అయితే, ప్రపంచ బ్యాంక్ మాత్రం అసలు కారణం చెప్పింది. మాములుగా ఏదైనా రాష్ట్రం ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం పొందాలి అంటే, నిబంధనల ప్రకారం కేంద్రం ఈ ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ కు పంపాలి. అలాగే అమరావతికి రుణం కావలి అని చంద్రబాబు ప్రభుత్వం అడిగిన సందర్భంలో, అప్పట్లో కేంద్రం, ఈ ప్రతిపాదనను, ప్రపంచ బ్యాంకుకు పంపించింది.

amaravati 200072019 1

అయితే, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో, కేంద్రం ఆ ప్రతిపాదన వెనక్కు తీసుకుంది. ఇదే విషయం ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా విభాగం సీనియర్‌ కమ్యూనికేషన్స్‌ అధికారి ఎలీనా కారబన్‌ మీడియాకు తెలిపారు. భారత ప్రభుత్వం, అమరావతికి రుణం ఇవ్వండి అనే ప్రతిపాదన వెనక్కు తీసుకుంది అని, అందుకే రుణం ఇవ్వం అని చెప్పమని చెప్పారు. ఇదే విషయం, భారత్‌, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌కు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టులను పర్యవేక్షించే ప్రపంచ బ్యాంకు విదేశీ వ్యవహారాల సలహాదారు సుదీప్‌ మజుందార్‌ కూడా చెప్పారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డుకు తెలియటంతో, అమరావతికి లోన్ ఇచ్చే విషయం వెనక్కు తీసుకున్నామని, వివరించారు.

amaravati 200072019 1

అయితే ఇప్పుడు ప్రశ్న, కేంద్రం ఎందుకు ఇలా చేసింది అని ? ఈ విషయం పై ఆరా తీస్తే, గత నెలలో ప్రపంచ బ్యాంక్ అధికారులు, అమరావతి వచ్చి, అక్కడ జరుగుతున్న పనులు అన్నీ చూసి, అపుడు రుణం ఇచ్చే విషయం పై ఆలోచిస్తామని, మా పర్యటనకు పర్మిషన్ కావాలని కోరారు. అయితే అమరావతి పై ఆసక్తి లేని జగన్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పై అనాసక్తిగా ఉందని గమనించిన కేంద్ర ప్రభుత్వం, ఈ విషయం పై ఇంకా ముందుకు వెళ్ళటం అనవరం అని గ్రహించి, ప్రపంచ బ్యాంక్ కు ఇచ్చిన ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. మొత్తానికి జగన్ ప్రభుత్వం, కేంద్రం కలిసి, ఇలా మన అమరావతికి లోన్ రాకుండా అడ్డుకున్నారు. చూద్దాం ఈ కొత్త ప్రభుత్వం, వాళ్ళు ఏమైనా కొత్త లోన్లు తీసుకు వస్తారేమో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read