విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, గత వారం రోజులుగా సొంత పార్టీ నేత పైనే నడిపిన ట్వీట్ వార్, బెజవాడ రాజకీయాల్లోనే కాదు, ఏపిలోనే హాట్ టాపిక్ అయ్యింది. ఏమైందో ఏమో కాని, ముందుగా కేశినేని నాని, బుద్దా వెంకన్న పై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చెయ్యటంతో, వివాదం మొదలైంది. తరువాత బుద్దా వెంకన్న కూడా, అదే రీతిలో కేశినేనిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఇలా దాదపుగా నాలుగు రోజుల పాటు, సొంత పార్టీ నేతల మధ్య ట్వీట్ వార్ నడించింది. ఇది వ్యక్తిగత దూషణలు వరకు వెళ్ళాయి. ఇద్దరి ప్రవర్తనతో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం, ఆందోళన చెందారు. అసలకే ఓడిపోయి ఉన్న పార్టీకి, ఇలా నేతలు బహిరంగంగా తిట్టుకుని, ప్రత్యర్దికి అవకాసం ఇవ్వటం పై, తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన చెందారు.
మధ్యలో వైసిపీ నేత పీవీపీ వచ్చి హడావిడి చేసారు. అయితే బుద్దా వెంకన్న మాత్రం, పార్టీకి నష్టం చేసే ఇలాంటి చర్యలు ఇంకా చెయ్యను అని వివాదాన్ని ముగిస్తున్నా అని చెప్పారు. అయితే కేశినేని నాని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక ట్వీట్లు ఏకంగా చంద్రబాబుని టార్గెట్ చేసి, మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టుకోండి, నన్ను పార్టీలో ఉండమంటారా, పొమ్మంటారా అంటూ చంద్రబాబునే ప్రశ్నించటం అందరినీ అవక్కయ్యేలా చేసింది. దీంతో కేశినేని నాని పార్టీ మారటనాకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఎప్పటి నుంచో నాని బీజేపీలో చేరతారు అంటూ ప్రచారం జరుగుతూ ఉండటంతో, నాని ట్వీట్ వార్, చంద్రబాబుని ప్రశ్నించటం చూసి, అందరూ నాని పార్టీ మారతారని డిసైడ్ అయిపోయారు.
అయితే కేశినేని నాని మాత్రం, ఎక్కడా మీడియాలో ఏమి మాట్లాడలేదు. ఈ రోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నివాసంలో, ఆయన్ను కలిసారు. పార్లమెంట్ భేటీ పై, అక్కడ అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. అయితే, కేశినేని నాని వివాదం మొదలు అయిన తరువాత, చంద్రబాబుని కలవటం ఇదే ప్రధమం కావటంతో, అందరి ద్రుష్టి ఈ భేటీ పై పడింది. కేశినేని నాని ట్విట్టర్ వార్ పై చంద్రబాబు అడిగినట్టు తెలుస్తుంది. అయితే లోపల ఏమి జరిగిందో కాని, రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలో మాత్రం, కేశినేని నాని నవ్వుతూ కనిపించటం, చంద్రబాబు పక్కనే హుషారుగా ఉండటం చూసి, ఈ వివాదం ముగిసినట్టే అని తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నాయి. ఏదైనా ఉంటే పార్టీ లోపల పరిష్కరించుకుందాం అని, బహిరంగంగా సొంత పార్టీ నేతల పై వ్యాఖ్యలు చెయ్యవద్దు అని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.