అమరావతికి రుణం ఇచ్చే విషయం పై, రెండు రోజుల క్రిందట ప్రపంచ బ్యాంక్, మీము రుణం ఇవ్వం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇది పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే, ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రుణం మంజూరు చేస్తాం అని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని కోరారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ విషయం పై ఏ స్పందన ప్రపంచ బ్యాంకుకు చెప్పక పోవటంతో, కేంద్రం కూడా పునరాలోచనలో పడింది. రాష్ట్రానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఈ తలనొప్పి మాకు ఎందుకు అని చెప్పి, ప్రపంచ బ్యాంకు కు, అమరావతికు రణం ఇవ్వండి అని గతంలో ఇచ్చిన ప్రతిపాదానను, కేంద్రం ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
దీంతో కేంద్రమే వెనక్కు తగ్గటంతో, ఇక చేసేది ఏమి లేక ప్రపంచ బ్యాంక్, మేము అమరావతికి రుణం ఇవ్వం అని చెప్పేసింది. గతంలో జగన్ పార్టీకి చెందిన నేతలు, అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ ఉత్తరాలు రాయటం, జగన్ కూడా అమరావతిని అవమానిస్తూ వ్యాఖ్యలు చెయ్యటం, ఇవన్నీ ఈ రోజు ప్రజలు గుర్తు చేసుకుని, జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే ఈ రోజు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వం అని చెప్పిందనే నిర్ధారణకు వచ్చారు. ఇక అమరావతి పని అయిపోయిందని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, తన యజమాని పై వ్యతిరేకత మొదలైందని అని గ్రహించిన జగన్ సొంత మీడియా, విషయాన్ని కవర్ చేస్తూ, ఈ రోజు ఒక అద్భుతమైన, అవాక్కయ్యే స్టొరీతో ప్రజల ముందుకు వచ్చింది. ఇది చూసిన ప్రజలు నిజంగానే అవాక్కయ్యారు.
ప్రపంచ బ్యాంకు రుణం కేవలం చంద్రబాబు వల్లే పోయిందని, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ప్రతిపాదనలు పంపారని, మళ్ళీ కొత్త రుణం ఇస్తారని రాసింది. అంతే కాదు అసలు విషయం ఏంటి అంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడదాం అనుకుంటున్న నవరత్నాలు పై కూడా, ప్రపంచ బ్యాంకు స్పందించిదని, నవరత్నాలకు కూడా మేము మీకు లోన్ ఇస్తాం అంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, జగన్ వెంట పడుతున్నారని, కధనాలని వండి వార్చింది. ఇది చూసిన ప్రజలు అవాక్కయ్యారు. ఎక్కడైనా ప్రపంచ బ్యాంక్ నవరత్నాలు లాంటి పధకాలకు రుణాలు ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు ? లోన్ ఇస్తున్నాడు అంటే, ఏదైనా ప్రజలు జీవితాలు మార్చే ప్రాజెక్ట్ లకు ఇస్తారు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కు ఇస్తారు కానీ, ఇలా రత్నాలకు, రాళ్లకి ఎక్కడైనా ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుందా అని ప్రజలు అవక్కవుతూ ప్రశ్నిస్తున్నారు.