పౌరహక్కుల నేతగా, ప్రొఫెసర్ గా హరిగోపాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. సీనియర్ అయిన ఆయన, అనేక ఉద్యమాల్లో పాల్గుని, పౌర సమాజం తరుపున పోరాడారు. తాజాగా హరిగోపాల్ ఒక వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్ల పై సంచలన కామెంట్స్ చేసారు. అప్పట్లో మేము, రాజశేఖర్ రెడ్డిని తరుచూ కలుస్తూ, పలు విషయాల పై చర్చించే వారమని చెప్తూ, కొన్ని సంఘటనలు గురించి చెప్పుకొచ్చారు. మీ నాన్న రాజారెడ్డి మీద ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, చివరకు ఆయన కూడా అలాగే చనిపోయారు కదా, దీని పై మీ అభిప్రాయం ఏంటి అండి అడిగినప్పుడు, రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయాన్నీ చెప్పారు. తన తండ్రి రాజా రెడ్డికి, పీపుల్స్ వార్ భావజాలం ఎక్కువగా ఉండేదని వైఎస్ఆర్ అన్నారని, చెప్పారు.
అందుకే ప్రజా కోర్ట్ లు పెట్టి, శిక్షలు అమలు చేసే వారిని, ఆ సందర్భంలో తన తండ్రి పై మర్డర్ కేసులు పెట్టారని, కాని రాజా రెడ్డి అలాంటి వారు కారని, వైఎస్ఆర్ చెప్పారని, చెప్పారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, ప్రజలకు డబ్బులు పంచటం ఎక్కువైంది అని ప్రశ్నించామని, దానికి వైఎస్ఆర్ సమాధానం చెప్తూ, తమకు ఉన్న బైరైట్ ఎస్టేట్లో, ఒక ప్రత్యేకమైన రాయి దొరికిందని, ఆ రాయి పెట్రోల్ ని రీఫైన్ చెయ్యటానికి ఉపయోగిస్తారాని, అప్పుడు డబ్బులు బాగా వచ్చాయని, దీంతో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజలకు కూడా కొంత డబ్బులు ఇచ్చే వాళ్ళం అని, అది తప్పా అని వైఎస్ఆర్ ప్రశ్నించారని హరిగోపాల్ అన్నారు. అదే విధంగా, 2004లో వైఎస్ఆర్ సియం కాకపోయే ఉంటె, పెద్ద ఎత్తున ప్రత్యెక రాయలసీమ ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యారని, అంతా రెడీ కూడా చేసుకున్నారని, కాని చంద్రబాబు ఓడిపోయి, అయన సియం కావటంతో, ఆ ప్రతిపాదన పక్కన పెట్టారనే సంచలన విషయం కూడా చెప్పారు.
ఇక జగన మోహన్ రెడ్డి చేసిన విన్యాసాలు గురించి కూడా ఆ రోజు వైఎస్ఆర్ ని అడగగా, ఎన్నో విషయాలు చెప్పేవారని చెప్పారు. ఒక సందర్భంలో, 2004లో, జగన్ మోహన్ రెడ్డి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని చితకబాదారని, ఆ విషయం వైఎస్ఆర్ దగ్గర ప్రస్తావించగా, ఆయాన జవాబు విని అవాక్కయ్యామని అన్నారు. వైఎస్ఆర్ మాట్లాడుతూ, అవును, జగన్ కు కొంత మంది అనుచరులు ఉన్నారు, వాళ్ళలో ఎవరి దగ్గరో లైసెన్స్ లేని తుపాకీ దొరికింది. అప్పుడు సిఐ, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన 24 గంటల లోపు కోర్ట్ లో ప్రవేశపెట్టాలి. ఆ సిఐ అలా చెయ్యలేదు. దీంతో మా వాడు, ఆ పోలీస్ మీదకు వెళ్ళింది వాస్తవమే, నాలుగు తగిలించింది వాస్తవమే అంటూ కొడుకు గొప్పదనం గురించి వైఎస్ఆర్ చెప్పిన మాటలను, హరిగోపాల్ వివరించారు. మొత్తానికి మూడు తరాల వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి, హరిగోపాల్ చెప్పిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీళ్ళ స్వభావం అందరికీ తెలిసిందే అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నారని తెలిసినా, ఇంత ధైర్యంగా హరిగోపాల్ గారు చెప్పటం మాత్రం హైలైట్..