తెలుగు మీడియా రంగంలో, 24 గంటల వార్తా ఛానెల్ ను స్థాపించి, రాష్ట్రంలోనే కాక, దేశంలోనే ఒక ఊపు తీసుకొచ్చిన రవి ప్రకాష్ మరొక న్యూస్ ఛానల్ తో మన ముందుకు రానున్నారు. రవి ప్రకాష్ టీవీ9 ఛానెల్ ని ఎలా పైకి తెచ్చారో, ఆ ఛానెల్ ని ఒక సంచలనంగా ఎలా మార్చారో అందరూ చూసారు. ఎదో ముప్పు వస్తుందని గ్రహించి, కొద్ది నెలల క్రితం మోజో టీవీ అని మరొక న్యూస్ ఛానల్ కూడా మొదలు పెట్టారు. అయితే అనూహ్యంగా అలందా మీడియా ఎంటర్ అవ్వటం, టీవీ9, మోజో టీవీని హస్తగతం చేసుకోవటం, రవి ప్రకాష్ ని బయటకు గెంటేయటం జరిగిపోయాయి. మరో పక్క రవి ప్రకాష్ పై కేసులు కూడా పెట్టి వేధించారు. రవి ప్రకాష్ కోర్ట్ కు వెళ్లి, అరెస్ట్ చెయ్యకుండా బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి. టీవీ9 అనే ఒక సంచలనం మొదలు పెట్టి, చివరకు బెయిల్ దాకా రవి ప్రకాష్ ప్రయాణం నడిచింది.

ravi 17072019 1

వీటి అన్నిటికీ కారణం, కేసిఆర్ తో పాటు ఆయన మాఫియా అయిన మైహోమ్స్ రామేశ్వర రావు, మేఘా కృష్ణా రెడ్డి అని బహిరంగంగానే విమర్శలు చేసారు రవి ప్రకాష్. తెలుగు మీడియాను వీరు కబ్జా చేస్తున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుందని, మిగతా ఛానెల్స్ కూడా లాక్కునే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారని ఆరోపించారు. రవి ప్రకాష్ ఆరోపించినట్టు గానే, మోజో టీవీని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రిందట ఆ ఛానెల్ సీఈఓ రేవతిని కూడా, పాత కేసును తిరగదొడి అరెస్ట్ చేసారు. అయితే కేసుల్లో ఇరుక్కుని, ఇబ్బందుల్లో ఉన్న రవి ప్రకాష్ ఏమి చెయ్యలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో హైకోర్ట్ లో రవి ప్రకాష్ కు ఊరట లభించింది. రవి ప్రకాష్ ను అరెస్ట్ చెయ్యవద్దు అంటూ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రవి ప్రకాష్ నెక్స్ట్ స్టెప్ పై మళ్ళీ ఆక్టివేట్ అయ్యారు.

ravi 17072019 1

ఈ నేపధ్యంలోనే, టీవీ9 మాజీ ఉద్యోగి జాకీర్ ఈ రోజు ఫేస్బుక్ లో లైవ్ వచ్చి, రవి ప్రకాష్ కొత్త టీవీ ఛానెల్ పెడుతున్నారని, ఆ వివరాలు త్వరలోనే చెప్తామని ప్రకటించారు. టీవీ ఛానెల్ పేరు టీవీ36 గా చెప్పారు. ఇక్కడ కూడా 3+6 = 9 వచ్చేలా జాగ్రత్త తీసుకున్నారు. రవి ప్రకాష్ ఛానెల్ పెట్టె ఏర్పాటులో ఉన్నారని, త్వరలోనే అన్ని వివరాలు చెప్తామని జాకీర్ చెప్తూ, రవి ప్రకాష్ పడుతున్న ఇబ్బందులు అన్నీ చెప్పుకొచ్చారు. అయితే రవి ప్రకాష్ కు బీజేపీ అండదండలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రవి ప్రకాష్ కంప్లైంట్ మేరకే, మొన్న మైహోం రామేశ్వరరావు పై ఐటి దాడులు జరిగాయని అందరికీ తెలిసిందే. ఇప్పటికే కేసిఆర్ పై బీజేపీ వార్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో రవి ప్రకాష్ చేత, బీజేపీ పెద్దలు న్యూస్ ఛానెల్ పెట్టిస్తున్నారా అనే వాదాన కూడా ఉంది. మొత్తానికి, ఈ మీడియా వార్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read