ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, జగన్ మోహన్ రెడ్డి నేను అవినీతి లేని సమాజం సృష్టిస్తాను అని చెప్పినా, ఎన్నికల్లో ప్రతి పార్టీ డబ్బు పంచుతుంది, బాగా డబ్బు పంచే పార్టీ, పోల్ మ్యానేజ్మెంట్ చేసే పార్టీకి, అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎన్నికలు అంటే బాగా కాస్ట్లీ అయిపోయిన రోజులు ఇవి. ఎంతటి గొప్ప వాడు అయినా, గెలవాలి అనే ఆలోచన ఉంటే, ముందుగా డబ్బు ఉంటేనే బరిలోకి దిగాలి. ప్రజలు కూడా అలాగే అలవాటు పడిపోయారు. ఎన్ని పధకాలు పెట్టినా, 10 వేలు ఇచ్చినా, 2 వేలు పెన్షన్లు ఇచ్చినా, ఎన్నికల ముందు పంచే డబ్బులే వాళ్లకి ముఖ్యం. అయితే, రాజకీయ నాయకులు మాత్రం, ఎబ్బే మేము అసలు రూపాయి తియ్యలేదు అని చెప్తారు. కొంత మంది మాత్రం, ఎచ్చులకు పోయి, ఇబ్బందులు పడతారు.

undi 11082019 2

దానికి బెస్ట్ ఉదాహరణ మొన్నటి జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్పటంతో, ఆయన పై ఇప్పుడు కోర్ట్ లో కేసు నడుస్తుంది. అయితే, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేసారు వైసీపీ నేత. జేసి దివాకర్ రెడ్డి అంటే, ఓడిపోయారు కాబట్టి, ఆయన గురించి పెద్దగా పట్టించుకోరు కాని, అధికారంలోకి వచ్చిన పార్టీ, మేము డబ్బులు పెట్టి గెలిచాం అంటే, అది నిజంగా సెన్సేషన్ అనే చప్పాలి. వైసీపీ తరుపున, ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నరసింహ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం అయితే, వైసీపీలో మాత్రం అవాక్కయ్యేలా చేసాయి. మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా నరసింహ రాజు, నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

undi 11082019 3

మన జిల్లాలోనే కాదు, చాలా మందికి పార్టీ నుంచి 10 నుంచి 18 కోట్లు డబ్బులు పార్టీ నుంచి వచ్చాయి, కాని నేను మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఎన్నికలకు వెళ్ళాను, నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను కాని, మిగతా వారిలాగా పార్టీ నుంచి వచ్చిన 18 కోట్లతో ఎన్నికలకు వెళ్ళలేదు అంటూ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఇది ఎక్కడ జగన్ కు చుట్టుకుంటుందా అని వైసీపీ నేతలు కంగారు పడే పరిస్థితి. ఎన్నికలకు, ఈసీ ఇచ్చిన నిబంధనలు మేరకే ఖర్చు పెట్టాలి. మరి ఇప్పుడు నరసింహరాజు అంటున్నట్టు, జగన్ ప్రతి నియోజకవర్గానికి 18 కోట్లు పంపిస్తే, అవి ఏమయ్యాయి ? ఎలా ఖర్చు పెట్టారు ? ఈ దిశగా కనుక ఎలక్షన్ కమిషన్, కోర్ట్ లు ఆలోచిస్తే, వైసీపీ పార్టీకి ఇబ్బందులు తప్పవు. అయినా ఆ పరిస్థితి మన దేశంలో రాదు అనుకోండి. https://www.facebook.com/TeluguPrajalaNadi/videos/2058685101093262/

Advertisements

Advertisements

Latest Articles

Most Read