విజయవాడలో ఫైర్ బ్రాండ్ నేతగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా, గత కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో ఈ వార్తలకు అంతు లేకుండా పోయింది. దీనికి తోడు, బొండా ఉమా పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ కూడా ఈ వదంతులకు బలం చేకూర్చింది. తాను న్యూజిల్యాండ్ పర్యటనలో బంగీ జంప్ చేస్తున్న ఫోటో పెట్టి, నా తరువాత రాజకీయ అడుగు ఇలా ఉంటుంది అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అందరూ , బొండా ఉమా పార్టీ మార్పు ఖాయంగా భావించారు. దీనికి తోడు, ఎన్నికలు అయిన దగ్గర నుంచి బొండా ఉమా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా, ఈ పార్టీ మార్పు వార్తలకు బలం చేకూర్చేలా చేసింది.

bonda 10082019 2

అలాగే చంద్రబాబు విదేశాలకు వెళ్ళిన సమయంలో కాపు నాయకులు అందరూ మీటింగ్ పెట్టుకోవటం, అందులో బొండా ఉమా ప్రముఖంగా ఉండటంతో పాటు, ఆయన బీజేపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే తరువాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితితులతో బొండా ఉమా అలక పాన్పు ఎక్కారని చంద్రబాబుకు తెలియటంతో, పిలిచి మాట్లాడారు. అయితే, తరువాత బొండా ఉమా చాలా రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని, జగన్ ఆయానకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే, బొండా ఉమా పార్టీ మార్పు ఖాయం అనే అనుకున్నారు.

bonda 10082019 3

ఈ నేపధ్యంలోనే బొండా ఉమా, విదేశాల నుంచి తరిగి విజయవాడ వచ్చారు. దీంతో విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమా వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. చంద్రబాబు దూతగా వచ్చానని, జరుగుతున్న ప్రచారం పై ఇరువురూ చర్చించారు. దాదపుగా గంటకు పైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ముగిసిన తరువాత బొండా ఉమా మాట్లాడుతూ, నేను చంద్రబాబునాయుడు గారి తోనే ఉంటానని , తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. అంతే కాదు, ఇదే విషయాన్నీ చెప్తూ ఫేస్బుక్ పోస్ట్ రాసి, ఐ యాం విత్ సిబిఎన్ అంటూ చంద్రబాబు ఫోటో పెట్టి, బొండా ఉమా పోస్ట్ చేసారు. దీంతో బొండా ఉమా పార్టీ మారతారు అనే ప్రచారానికి ఇక తెర పడినట్టు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read