ప్రజా సంక్షేమంపై టీడీపీ సర్కారు ఫోకస్‌ పెంచడంతో పేద, సామాన్య వర్గాలలో సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ పాజిటివ్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ కేడర్‌ సీరియస్‌గా దృష్టిసారిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ ఫోన్లను ఉచితంగా అందించే స్కీమ్‌ బాగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 20 లక్షల 18 వేల 747 మంది మహిళా ఓటర్లు ఉండగా.. ఇందులో 9 లక్షల మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. అంటే మహిళా ఓటర్లలో 40 శాతంపైగా స్వయం సహాయక సంఘాల్లో ప్రాతిధ్యం ఉంది. స్మార్ట్‌ ఫోన్లు, పసుపు-కుంకమ కింద డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలకు వీరిలో మెజారిటీ మహిళలు టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్నట్టు టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.

tdp 26012019

డ్వాక్రా సంఘాల్లో కీలక ప్రతినిధులు.. వారు ఓట్లు వేయడమే కాకుండా.. ఇంకొంతమందిని ప్రభావితం చేయగలరని టీడీపీ కేడర్‌ విశ్వాసంతో ఉంది. అలాగే ఆటోలు, ట్రాక్టర్ల టాక్స్‌ రద్దు, 2014 జూన్‌ నుంచి మంజూరు కాకుండా నిర్మించుకున్న పేదల ఇళ్లకు రూ.60 వేల కేటాయింపు, మరమ్మతులకు రూ.10 వేలు.. ఇలాంటి స్కీమ్స్‌ పాజిటివ్‌ వేవ్‌ తీసుకువస్తున్నట్టు సర్వేల్లోనూ వెల్లడవుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మినిమం టైమ్‌స్కేల్‌ ఇవ్వడానికి మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ వాయిదాల రూపంలో చెల్లించాలన్న నిర్ణయం, ఒక డీఏ ఈ నెల నుంచే సర్దుబాటు చేయడం వంటివన్నీ ఉద్యోగులలోనూ టీడీపీ పట్ల అనుకూల వాతావరణం తీసుకువచ్చినట్లు సంబరపడుతున్నారు.

tdp 26012019

పింఛను రెట్టింపుతో జోష్‌.. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల.. ఇలా పలు పింఛన్లను రెట్టింపు చేయడం ఆయా లబ్ధిదారులతోపాటు.. టీడీపీ కేడర్‌లో జోష్‌ కనిపిస్తోంది. పింఛన్ల ఎఫెక్ట్‌ బాగా పాజిటివ్‌గా ఉంటుందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కొంత నైరాశ్యంలో ఉన్నాయి. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, మత్స్యకారులు.. ఇలా మొత్తం 5 లక్షల 54 వేల 434 మంది నెలనెలా పింఛను అందుకుంటున్నారు. పింఛను అందుకునే వ్యక్తే కాకుండా.. కుటుంబంలో వ్యక్తులూ ఈ పెంచిన పింఛనుపై ఆనందంగానే ఉన్నారు. ఇవన్నీ టీడీపీకి సానుకూల వాతావరణం సృష్టిస్తున్నట్టు ప్రధాన పార్టీల నేతలే అంగీకరిస్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read