ప్రతిపక్షలని ఏకం చెయ్యటం, ఓటు చీలకుండా ఉంచి, మోడీని దెబ్బ కొట్టటం... ఇదే ఎజెండాతో చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆక్టివ్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీకి బుద్ధి చెప్పటానికి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలని కలుపుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో కలిసారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే ఫార్ముల అమలు అయ్యేలా చూస్తున్నారు. రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంటే, జాతీయ స్థాయిలో కలిసి పోరాటం చేద్దామని ఒప్పించారు. ఇందులో భగంగా, ఉత్తర ప్రదేశ్ లో చంద్రబాబు ఫార్ములా సూపర్ సక్సెస్ అయ్యింది. ఉప్పు నిప్పుగా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీకి రెడీ అయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ తో కలవకపోయినా, జాతీయ స్థాయిలో కలుస్తామని చెప్పాయి. అయితే, ఈ కలియక తరువాత చేసిన సర్వేలో, ఉత్తర ప్రదేశ్ లో మోడీ అడ్రస్ లేకుండా పోయారు.

cbn 26012019

‘ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్’ సర్వే ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో 71 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీకి ఈ సారి మాత్రం పూర్తిగా నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో భాజపా-అప్నా దళ్‌ కూటమికి కేవలం 18 సీట్లే వస్తాయని సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి 2014 ఎన్నికల్లో మొత్తం 73 స్థానాల్లో గెలుపొందాయి. ఆ ఎన్నికల ఫలితాలతో పోల్చితే ఈ సారి భాజపా 53 సీట్లను కోల్పోనుందని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో భాజపా మిత్రపక్షం అప్నా దళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం... మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), అఖిలేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) కూటమికి ఈ సారి 58 సీట్లు వస్తాయి. రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కూడా ఈ కూటమితో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి.

cbn 26012019

సర్వే ప్రకారం.. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 2 సీట్లు గెలుచుకోగా ఈ సారి ఆ పార్టీ 4 స్థానాల్లో గెలుపొందుతుంది. బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు. ఎస్పీ 5 స్థానాల్లో గెలుపొందింది. ఈ మూడు పార్టీలు కలిసి గతంలో సాధించిన సీట్ల కంటే ఈ సారి 53 సీట్లు అధికంగా సాధించనున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ సర్వే కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 2,400 మంది ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. బీఎస్పీ-ఎస్పీ పొత్తులో కాంగ్రెస్‌ కూడా ఉన్నట్లయితే భాజపాకు మరింత క్లిష్ట పరిస్థితి ఎదురయ్యేదని సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read