కొన్ని రోజుల క్రితం అనంతపురంలో జరిగిన ఘటనలో, సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్ విసిరి వార్తల్లోకి వచ్చిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ గుర్తున్నాడా ? ఈయన్ను చూసి, పోలీస్ అంటే ఇలాగే ఉండాలి, రాజకీయ నాయకులతో ఇలాగే ఉండాలి అని అందరూ అనుకున్నారు. కాని, ఇప్పుడు ఈ మాధవుడు చేసిన పని చూసి, దీని వెనుక కూడా రాజకీయ కోణం ఉందని, ఉద్యోగాల్లో ఉండి కూడా, ప్రభుత్వాల పై ఎంత ద్వేషం ఉందో తెలుస్తుంది. దివాకర్ రెడ్డి పై అంత ఇదిగా మీసం మెలేసి, చివరకు లోటస్ పాండ్ ల తేలాడు, ఈ మాధవుడు. మరి జగన్ దగ్గర అలా మీసా మెలేస్తే ఏమి చేస్తాడో ఏంటో..
హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, జగన్ పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద గొడవలు జరిగిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో పోలీసులను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దూషించారు. దీంతో మాధవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ "తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తాను'' అని నేతలను హెచ్చరిస్తూ మీసం మెలేశారు. మాధవ్ తీరుపై జేసీ స్పందించారు. "ఒక సీనియర్ పొలిటీషియన్, పైగా ఎంపీ అయిన తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి'' అని తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎంపీ దివాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. పార్లమెంట్‌కు కూడా ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు మాధవ్ వ్యవహారంపై 20 రోజుల్లోగా తమ అభిప్రాయం చెప్పమని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే, మాధవ్ తన పదవికి రాజీనామా చేసి, వైసిపీ లాంటి పార్టీ అండ ఉంటే, ఇంకా జేసి పై రేచ్చిపోవచ్చని, ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మరో పక్క జేసి వర్గం మాత్రం, మరోలా స్పందించింది. ఆయన పోలీస్ కాబట్టి, ఎంపీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, న్యాయ పరంగా ఎదురుకుంటున్నారని, ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయంగా వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీసం మెలేస్తే, ఏమి చెయ్యాలో అది చేస్తామని అంటున్నారు.