ఎవరో ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ పెడితే, అందులో కొంత మంది డబ్బులు పెట్టుకుంటే, ఆ చిట్ ఫండ్ కంపెనీ చేతులు ఎత్తేసింది. ఇది జరిగింది ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇది ప్రభుత్వానికి సంబందించిన విషయం కాదు. ఆ కంపెనీ ఆస్థులు ఉంటే, అవి వేలం వేసి, ప్రజలకు ఇవ్వటం వరుకే ప్రభుత్వం బాధ్యత. అయితే దీన్ని కూడా రాజకీయంగా వాడుకుని, అసలు ఇప్పటి ప్రభుత్వానికి సంబంధం లేని విషయం అయినా, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. అయితే చంద్రబాబు మాత్రం, దీన్ని రాజకీయ కోణంలో చూడలేదు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజలకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతోనే, వారిని అన్ని విధాలుగా ఆదుకోవటానికి ముందుకొచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

agri 07022019

రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ వద్ద రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు తొలుత చెల్లింపులు చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లాస్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 32లక్షల మంది నుంచి అగ్రిగోల్డ్‌ సంస్థ రూ.6,380 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించింది. ఇందులో ఏపీలోనే 10లక్షలకు పైగా డిపాజిటర్లు ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది.

agri 07022019

అయితే ఇందులో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన మదుపుదారులు 3.5లక్షలు ఉన్నారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పాటు రూ.500 కోట్ల మేర అగ్రిగోల్డ్‌ సంస్థ వివిధ బ్యాంకులను మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. అగ్రిగోల్డ్‌ జారీ చేసిన చెల్లని చెక్కుల విలువ రూ.700కోట్లు మేర ఉంటుందని విచారణలో వెల్లడైంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేసి వేలం వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున ముందుగా చిన్న మొత్తంలో డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read