ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చండ్రనిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న అగహాన్ని సభలో బీజేపీ నేతల మీద వెళ్లగక్కారు. ఎప్పుడూ ఆలోచనతో మాట్లాడే సీఎం ఈరోజు ఆవేదనతో మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వేళ బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో ఒకసారి గుజరాత్ కు వెళ్లి చూడవయ్యా, కంపేర్ చెయ్యి, కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసిది పోయి, సిగ్గు వదిలిపెట్టి, మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? రోషం లేదా మాకు అంటూ మండిపడ్డారు. ఇక ఆ సమయంలో ‘అబ్జెక్షన్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే, తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
కేంద్రం రాష్ట్రంమీద సవతిప్రేమ చూపిస్తుందంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం కేంద్రాన్ని ఎంతగా వెనకేసుకురావాలో అంతగా మోసేస్తున్నారు. అసలు కేంద్రం ఇస్తామన్నవాటితో పాటు అదనంగా కూడా ఇచ్చిందంటూ ఎక్కడలేని క్రెడిట్స్ కూడా ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను చంద్రబాబు ప్రభుత్వం మింగేస్తుందనడం రాజకీయ విమర్శ, అది ప్రజలుకు అనవసరం. అసలు కేంద్రం ఏపీకి నిజంగానే అన్నీ ఇచ్చిందా? బీజేపీ నేతలు మైకుల ముందు చెప్పే వాటిలో నిజముందా? దాడికి ఎదురుదాడి పనిగా పెట్టుకొని బీజేపీ కాలం గడిపేస్తుందా? అంటే ఏపీ సామాన్య ప్రజలలో అవుననే అంటున్నారు.
ప్రజలు ఏమనకుంటున్నారో, ఈ రోజు అలాగే ప్రవర్తించారు జీవీఎల్. అసెంబ్లీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రజలు బాధని వ్యక్త పరిస్తే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాత్రం, సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని, సీఎం ప్రవర్తన చూస్తే పిచ్చి పీక్స్ కు చేరినట్లు తెలుస్తుందని తన ట్విట్లర్ లో పేర్కొన్నారు. మహా ఫ్రస్టేషన్ లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీ లా ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు. సీఎం తీరుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్లు జీవీఎల్ తెలిపారు. అయితే జీవీఎల్ తీరు పై ప్రజలు మండిపడుతున్నారు.