రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం బిజీబిజీగా గడిపారు. విజయవాడకు శనివారం చేరుకున్న ఆయన రాజధాని ప్రాంతంలోని నేలపాడు వద్ద నిర్మించనున్న ఏపీ హైకోర్టు శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం జ్యుడీషియల్ కాంప్లెక్సును ప్రారంభించారు. తాత్కాలిక హైకోర్టు నిర్మాణ విశేషాలను ఆడియో, వీడియో ప్రజంటేషన్ ద్వారా అధికారులు ఆయనకు వివరించారు. అమరావతి నగర నిర్మాణ నమూనాలను ఆసక్తిగా తిలకించారు. హైకోర్టు, శాసనసభ, 9నగరాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.

court 04022019

రాజధానిలో వర్సిటీల ఏర్పాటు గురించి అధికారులను జస్టిస్ గొగోయ్ అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక హైకోర్టు ఆవరణ పరిధిలో 100 అడుగుల ఎత్తుల ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జస్టిస్ గొగోయ్ ఆవిష్కరించారు. తాత్కాలిక హైకోర్టు భవనంలో ప్రవేశద్వారం సమీపంలో గోడపై ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తాత్కాలిక హైకోర్టులోని వివిధ హాళ్లను సందర్శించారు. రెండో అంతస్తులోని కోర్టు హాల్‌ను కూడా పరిశీలించారు. 179రోజుల్లో భవన నిర్మాణం పూర్తిచేయడంపై ఆశ్చర్యం, హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆయన హెలికాప్టర్‌లో అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాలను వీక్షించారు. ఈ పర్యటనలో ఆయన వెంట దీపాంజలీ గొగోయ్ కూడా ఉన్నారు. కాగా తాత్కాలిక హైకోర్టుగా వ్యవహరించే జ్యుడీషియల్ కాంప్లెక్సును 4.6 ఎకరాల్లో నిర్మించారు. 2.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా నిర్మించారు. 22 కోర్టులు, జడ్జిల చాంబర్లను, గ్రంథాలయం, బార్ రూమ్, అడ్వకేట్ల చాంబర్ల వంటివి దీనిలో ఏర్పాటు చేశారు.

court 04022019

‘‘అమరావతిలో ఏర్పాటు చేసే నవనగరాల్లో ఒకటైన న్యాయనగరం (జస్టిస్‌ సిటీ)లో నల్సార్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు సహకరించాలి. అందుకు అవసరసమైన భూమి, కావాల్సిన నిధులు ఇస్తాం. సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌ల తరహాలో మధ్యవర్తిత్వ, వివాద పరిష్కార కేంద్రాలు (ఆర్బిట్రేషన్‌, డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ సెంటర్‌)లను ఏర్పాటు చేయాలి. న్యాయ విద్యాలయాలను నెలకొల్పేందుకూ తోడ్పాటు అందించాలి. హైకోర్టు ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. వారికి ఉచిత వసతి, రవాణా సదుపాయాలూ కల్పిస్తాం. రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 1.70 లక్షల పరిష్కారానికి సాంకేతికత వినియోగించుకోవొచ్చు’’ అని చంద్రబాబు సూచించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వారు భూములివ్వకపోతే ఈరోజు ఈ నిర్మాణాలేవీ సాధ్యమయ్యేవి కాదన్నారు. రాజధానిలో మౌలిక వసతులకు రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read