చెరువు మీద అలిగితే ఏమవుతుంది ? నష్టం చెరువుకి కాదు, అలగిని వాడికే.. తరతరాలుగా ఈ సామెత తెలుసుకుని, జీవితాన్ని మలుచుకున్న వాళ్ళే కాని, అడ్డదిడ్డంగా వెళ్ళిన వారు లేరు. మొదటి సారి మనకు జగన మోహన్ రెడ్డి రూపంలో తగిలాడు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేసుల మాఫీ కోసం కాదంట, ఎలక్షన్ కమిషన్ కు, చంద్రబాబు మీద ఫిర్యాదు చెయ్యటానికి. ఎవరైనా ఫిర్యాదు చెయ్యచ్చు తప్పు లేదు. కాని, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు, చేసిన డిమాండ్ చూసి, ఎలక్షన్ కమిషనే ఖంగుతినేలా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి డిమాండ్ , ఏ రాష్ట్రం నుంచి, ఏ నాయకుడు చెయ్యకపోవటంతో, ఈ విషయం చెప్తున్న సమయంలో జాతీయ మీడియా కూడా షాక్ అయ్యింది.

jagan ec 04022019

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు సామాజికవర్గ నేతలందరినీ తప్పించాలని, అప్పుడే ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని అన్నారు. సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చిన సమయంలో, 35 మంది చంద్రబాబు సామాజికవర్గ వారే ఉన్నారని అన్నారు. అయితే, ఇక్కడ దాదపుగా 2-3 మాత్రమే ఆ సామాజికవర్గం వారని లెక్కలు చెప్తున్నాయి. ఇక ఎప్పటి లాగే, డీజీపీ, ఇంటెలిజిన్స్‌ డీజీ పై కూడా తన కోపం చూపించారు. ఇంటెలిజిన్స్‌ డీజీ చంద్రబాబు సామాజికవర్గం అని, వీరిని కూడా బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌ డిమాండ్ చేశారు. మరో వింత ఏంటి అంటే, 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ, జగన్ మరో వింత మాట మాట్లాడారు.

jagan ec 04022019

ఉన్న ఓట్లే 2 కోట్ల పైన అయితే, 40 శాతం దొంగ ఓట్లు ఉన్నాయని జగన్ అనటంతోనే, తాను ఏ పరిస్థితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి నుంచే ఓటమికి ప్రిపేర్ అవుతునట్టు ఉంది. ఏదన్నా 10, 20 లక్షలు అంటే ఎవరన్నా నమ్ముతారు. తెలంగాణాలో 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటేనే ఎవరూ నమ్మలేదు, అలాంటిది ఏకంగా 60 లక్షలు దొంగ ఓట్లు అంటే, అసలు అది సాధ్యం అయ్యే పనేనా. ఇలాంటి మాటలు మాట్లాడితే, ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారా ? అయినా చంద్రబాబు మీద కోపం ఉంటే చంద్రబాబుని తిట్టాలి, ఆయన సామాజికవర్గం మొత్తం అసలు ఎన్నికల్లో పని చెయ్యకూడదు అనేది వింత వాదన కాదా ? చంద్రబాబు సామాజికవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తుందా ? తన పార్టీలో సామాజికవర్గం వారు లేరా ? ఇలా ఒక సామాజికవర్గం మొత్తాన్ని నమ్మను అని ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా బహిరంగంగా చెప్పటం, బహుసా ఇదే మొదటి, చివరి సారి అయి ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read