తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడూ చిన్న చూపే. తెలంగాణలో ప్లే బాయ్ క్లబ్ ఓపెన్ అయినా, గుడ్డలు చించుకుని కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తే సినీ హీరోలు, ఆంధ్రప్రదేశ్ లో కియా లాంటి కార్ల కంపెనీ వస్తే కనీసం స్పందించలేదు. నిన్న సినీ హీరో రాం స్పందించారు. తరువాత నారా రోహిత్ స్పందించారు. అయితే ఈ రోజు ఉదయం మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ చేసారు. అది వైరల్ అయ్యిందో లేదో, మరి కొద్దిసేపటికే ఆ ట్వీట్ డిలీట్ అయ్యింది. మరి మంచు మనోజ్ ఎవరి ఒత్తిడి వల్ల డిలీట్ చేసారో కాని, అప్పటి దాక పొగిడిన వారు, విమర్శిస్తున్నారు. ఇది మంచు మనోజ్ ట్వీట్ చేసి డిలీట్ చేసింది, "This is quite prestigious to see #KiaMotors launch their first vehicle manufactured in our very own AP benefiting the low rainfall situations in #Anantapur..Big cheers to the state government for making this happen! A brilliant step of building a brighter state! ????????#KiaMadeInAP"

manchu 30012019 1

ఇది ఇలా ఉంటే, హీరో రాం మాత్రం, రెండో ట్వీట్ కూడా వేసి ప్రశంసించారు. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో జిల్లాకు నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. దీనిపై రామ్‌ స్పందిస్తూ.. ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని పేర్కొన్నారు. రామ్‌ ఈ ట్వీట్‌ చేయగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.

manchu 30012019 1

ఈ కామెంట్లపై రామ్‌ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సల్లేదు. ముందు నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడ్ని’ అని వెల్లడించారు రామ్‌. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. రీల్ హీరోలంతా రామ్‌ను చూసి నేర్చుకోవాలి’ అని ఒకరంటే.. ‘నువ్వు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోనక్కర్లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే సినిమా వాళ్లంతా అభినందించారు. ఆనాడు లేవని గొంతులు నేడు బాబు గారిని ఒకడు అభినందిస్తే ఎందుకంత బాధ’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ‘అంతర్జాతీయ కార్ల సంస్థ మన దగ్గర స్టార్ట్ చేశారు అని తెలుగువాళ్లందరం గర్వపడే సందర్భంలో పోస్ట్ పెట్టి విష్ చేసిన మీకు మొదటగా అందరి తరుపున ధన్యవాదాలు రామ్ గారు.. దీంట్లో కూడా కులం-ప్రాంతం చూస్తున్న వారికో నమస్కారం. అరేయ్ భయ్ పార్టీలు పక్కన పెట్టి మంచిని అభినందించండిరా’ అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు. మొత్తానికి రామ్ మాత్రం తన ట్వీట్‌తో ఎన్నో హృదయాలను గెలిచేశాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read