ఓ పక్క రైతులకు నీళ్లిచ్చాం, మరోవైపు కియ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం ఎలక్షన్‌ మిషన్‌ 2019పై సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ముందంజలో ఉన్నామని, అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేశామన్నారు. వైఎస్ హయాంలో లేపాక్షి హబ్, సైన్స్ సిటి ఏమైందని ప్రశ్నించారు. తాము తెచ్చిన వోక్స్ వ్యాగన్‌ను తరిమేశారని మండిపడ్డారు. జర్మనీలో అధికారులను జైల్లో పెట్టించారని గుర్తుచేశారు. ఇక్కడ జగన్, బొత్స పోజులు కొడుతున్నారని, అంతర్జాతీయంగా ఏపీకి అప్రదిష్ట తెచ్చారని విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లలో ఏపీ ప్రతిష్టను టీడీపీ పెంచిందని సీఎం చెప్పుకొచ్చారు.

cbn cases 30012019

టీడీపీతో కలిసి భేటీలో కూర్చోబోమనడం హాస్యాస్పదమన్నారు. జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటిలో కూర్చోరా అంటూ దుయ్యబట్టారు. 16 ఏళ్లలో కన్నా తనపై 3 పిటిషన్లు వేశారని, వైఎస్ స్వయంగా 13 పిటిషన్లు వేశారని, అనుచరులతో 12 కేసులు వేయించారని ఆయన గుర్తు చేశారు. 9 ఏళ్లలో మొత్తం 25కోర్టు కేసులు వేశారన్నారు. జగన్ తల్లితో 2, 464 పేజీల పిల్ వేయించారని తెలిపారు. తనపై వేసిన అన్ని పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయని, ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయారననారు. పోలవరం, అమరావతి, పట్టిసీమపై కేసులు వేశారని మండిపడ్డారు. జగన్, మోదీ కుట్రలను కన్నా అమలు చేస్తారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

cbn cases 30012019

జగన్ అత్యాశ రాష్ట్రానికే పెను ప్రమాదమన్నారు. అత్యాశతోనే జగన్మోహన్‌రెడ్డి పతనం ఖాయమని స్పష్టంచేశారు. డబ్బు, అధికార వ్యామోహం ఉండకూడదని హితవుపలికారు. మోదీ పాలన వైఫల్యాలపై చైనాలో ప్రచారం జరుగుతోందని, చైనా గ్లోబల్‌ టైమ్స్‌ కథనాలే మోదీ వైఫల్యాలకు రుజువని పేర్కొన్నారు. మోదీపై నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉందని సీఎం తెలిపారు. విపత్తు సాయంలోనూ ఏపీపై మోదీ వివక్ష చూపించారని మండిపడ్డారు. మహారాష్ట్రకు రూ.4,717 కోట్లు ఇచ్చి ఏపీకి రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 347 మండలాల్లో కరువును కేంద్రం పట్టించుకోలేదన్నారు. తితలీ తుఫాన్‌ వల్ల వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. బీజేపీ చిత్తుగా ఓడిపోతేనే ఏపీకి న్యాయం చూకూరుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read