జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన అవినీతి, అతని పై ఉన్న కేసులు, వీటి అన్నిటి నుంచి, జగన్ ను రక్షించాలి అంటే, ఎవరి తరం కాదు. కొన్ని రోజులు లేట్ చెయ్యచ్చు ఏమో కాని, ఎదో ఒక రోజు, జగన్ కచ్చితంగా జైలుకి వెళ్తాడు. అతన్ని రక్షించటం ఎవరి వల్లా కాదు అని, నిన్న హైకోర్ట్ వ్యాఖ్యలు చూస్తే అర్ధమువ్తుంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెన్నా గ్రూపు కంపెనీలకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తమపై సీబీఐ కేసులను కొట్టివేయాలంటూ పెన్నా గ్రూపు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. అయితే ప్రతాప్‌రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 12 కింద నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఐపీసీ సెక్షన్‌ 120బి, 420 కింద విచారణ చేపట్టడానికి సీబీఐ కోర్టుకు అనుమతించింది. పెన్నా గ్రూపు ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డితోపాటు పెన్నా సిమెంట్స్‌, పి.ఆర్‌.ఎనర్జీ హోల్డింగ్స్‌, పయనీర్‌ హోల్డింగ్స్‌, పెన్నా తాండూర్‌ సిమెంట్స్‌లు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వేర్వేరుగా దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి పిటిషనర్ల వాదనలు, ప్రాసిక్యూషన్‌ అభియోగాలపై కూలంకషంగా చర్చిస్తూ 158 పేజీల తీర్పును వెలువరించారు.

court 27012019

ఈ నేపధ్యంలో కోర్ట్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది... రాజకీయ అవినీతి క్యాన్సర్‌లా విస్తరిస్తోంది. ఇది సగటు మనిషికి ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. ప్రజలందరికీ చెందాల్సిన భూములను, సున్నపురాయి గనుల వంటి ప్రకృతి సంపదను ప్రభుత్వాలే ఇష్టానుసారం కట్టబెట్టడం.. ఇందుకోసం నిషేధ చట్టాన్ని అతిక్రమించడం.. వీటి వెనుక పెద్ద ఎత్తున నిధులు చేతులు మారడం.. అలా మారిన సొమ్ము ఏ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నిర్ణయాలు జరిగాయో అదే ముఖ్యమంత్రి కొడుకు కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిరావడం.. ఇవన్నీ సమాజానికి, ప్రజాస్వామ్యానికి, ప్రతిభకు తీవ్ర హానికరమైన అంశాలు. వీటిని సాధారణ నేరాలుగా చూడలేం. న్యాయస్థానం వీటిని ప్రత్యేక సామాజిక దృక్కోణంలో చూడాల్సి ఉంది. ముఖ్యమైన మౌలిక వసతుల కోసం ఉపయోగపడాల్సిన జాతీయ సంపద పెడదారిన పడితే తరాలకొద్దీ యువత తన మేధస్సుకు పనిపెట్టే అవకాశాన్ని కోల్పోతుంది. ఇలాంటి వాతావరణం పెట్టుబడులు రావడానికిగానీ, ఉద్యోగాల సృష్టికిగానీ ఉపయోగపడబోదు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది." అంటూ కోర్ట్ వ్యాఖ్యానించింది.

court 27012019

తీర్పులో ముఖ్యమైన అంశాలు... * చట్ట ప్రక్రియ దుర్వినియోగమైనపుడు మాత్రమే హైకోర్టులు తమ ప్రత్యేక అధికారాలను వినియోగించాల్సి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక్కడ పేర్కొన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక అధికారాలతో కేసును కొట్టివేయలేం. * పెన్నా సిమెంట్స్‌కు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల కేటాయింపు చట్టప్రకారం జరగలేదు. భూలబ్ధిదారుల నుంచి భూమిని సేకరించడానికి వచ్చే అడ్డంకులను అధిగమించడానికి ఇలా చట్టానికి తెలియని విధానాన్ని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.తో ఉన్న సాన్నిహిత్యంతో ప్రతాప్‌రెడ్డి అనుసరించారు. * ప్రతాప్‌రెడ్డి, ఆయన కంపెనీలు అసైన్డ్‌ లబ్ధిదారులను ప్రలోభపెట్టి వారిని భూముల్లేని పేదలను చేశారు. చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములను బదలాయించడానికి వీల్లేదు. అయితే నలుగురు లబ్ధిదారుల నుంచి ప్రతాప్‌రెడ్డి విక్రయ దస్తావేజులను పొందారు. ఇది అసైన్డ్‌ చట్టానికి విరుద్ధమే. * కేటాయింపుల తరువాత జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయంటే ‘నీకది నాకిది’ (క్విడ్‌ప్రోకో)లో భాగమే. దురుద్దేశంతో జరిగినందున చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంది. సేకరణ : ఈనాడు

Advertisements

Advertisements

Latest Articles

Most Read