గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ వేదికగా జరిగిన ఏట్‌హోం కార్యక్రమంలో రాజకీయ సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సాంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసిన టీనీటి విందు కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు ఆయనతో కాసేపు ముచ్చటిం చారు. అనంతరం రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర రావుకు శుభాభినందనలు తెలిపిన పవన్‌ ఆయన పక్కనే కూర్చుని దాదాపు 20 నిమి షాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లి ఎన్నికలు, త్వరలో ఏపీలో జరగనున్న శాసనసభ ఎన్నికలపైనా ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

gov 270120199

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటా యన్న కోణంలోనూ సీఎం కేసీఆర్‌ ఏపీ రాజకీయాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబుని దెబ్బ కొట్టటానికి వ్యూహం ఖరారు చేసుకున్న కేసీఆర్‌ పవన్‌తో అత్యంత కీలకాంశాలపై చర్చించారని రాజకీయ వర్గాలు గుసగుస లాడుతున్నాయి. ఎట్‌హోంలో కనిపించిన పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా ముచ్చటించి ఏపీ రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా తీశారు. అంతకు ముందు కేటీఆర్‌ కూడా ఇదే కోణంలో పవన్‌తో చర్చించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏమిటని అడిగారు. అక్కడున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ, అభివృద్ధి తదితర అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్న సందర్భంలోనే గవర్నర్‌ నరసింహన్‌ పవన్‌

gov 270120199

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైనే ఎట్‌హోంలో పాల్గొన్న నేతల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇటీవల జగన్‌తో కేటీఆర్‌ భేటీ, జగన్‌ గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు వచ్చే నెలలో కేసీఆర్‌ అమరావతి పర్యటన తదితర అంశాలు పవన్‌తో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్‌తో భేటీ అంశాలను పవన్‌తో కేటీఆర్‌ ప్రత్యేకంగా చర్చించి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించినట్లు తెలుస్తోంది. తేనేటి విందు ముగింపు సమయంలో అందరూ రాజ్‌భవన్‌ నుంచి బయటకు వెళుతున్న క్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా అన్నారో… యాదృచ్చిక అన్నారో… తెలియదు కానీ ‘కేసీఆరే నాకు ప్రొటెక్షన్‌’ అన్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read