కాంగ్రెస్ మాజీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. లోటస్‌పాండ్‌లో జగన్ నివాసానికి తన కుమారుడు హితేష్ చెంచురామ్‌తో కలిసి వెళ్లారు. ఈ భేటీ ప్రస్తుతం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం టికెట్‌ను హితేష్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి భరత్ ఓటమిపాలవడంతో 2019 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ సమన్వయకర్తగా రావి రాంబాబును అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో రాంబాబును కాదని హితేష్‌కు టికెట్ కేటాయిస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. చాలా చోట్ల సమన్వయకర్తలను కాదని, కొత్త వారికి టికెట్లు కేటాయిస్తుండడంతో హితేష్‌కు కూడా టికెట్ దక్కవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న విషయం విదితమే.
ఆవిడ బీజేపీలో ఉంటూ, బీజేపీ బీ టీంలోకి కొడుకుని చేర్పించి, అదిరిపోయే స్కెచ్ వేసిందని అంటున్నారు. పైగా ఇప్పటికీ దగ్గుబాటి వెంకటేశ్వరావు కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఆయన కాంగ్రెస్ కి దూరంగా ఉన్నారే కాని, రాజీనామా చెయ్యలేదు అని తెలుస్తుంది. ఇదే నిజం అయితే, తండ్రి కాంగ్రెస్, కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్, తల్లి బీజేపీలో ఉండి, ఒక రికార్డు సృష్టించారు. మొన్న ఎన్టీఆర్ ఆత్మల గురించి మాట్లాడిన వారు, మరి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారో. ఎన్టీఆర్ ఆత్మ ఏమో కాని, వైఎస్ఆర్ ఆత్మా మాత్రం, పావురాలగుట్ట మీదుగా ఇడుపులపాయకి చిందులు తొక్కుకుంటూ వెళ్లి ఉంటుంది. కారంచేడు మారణఖాండని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకెంచి చెంచురామయ్యని దుషించారు వైఎస్ఆర్, ఇప్పుడు అదే చెంచురామయ్య గారి మనవడిని కౌగిలించుకున్నడు జగన్ రెడ్డి, ఇక వైఎస్ఆర్ ఆత్మ ఎంత సంతోషంతో పరవళ్ళు తోక్కుతుందో..