బాప్ ఏక్ నెంబర్, బేటా దస్ నెంబర్ అంటారు ఇందుకే.. జగన్ మోహన్ రెడ్డి వేసుకునే సెల్ఫ్ గోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో అమరావతికి రాను నన్ను పిలవద్దు అన్న దగ్గర నుంచి మొన్న ఆంధ్రా ద్రోహి కేసీఆర్ తో భేటీ దాకా అన్నీ సెల్ఫ్ గోల్స్ వేసుకోవటమే... ఒక్కటంటే ఒక్క సరైన పని చెయ్యడు. ఏ పని చేసినా, అది సెల్ఫ్ గోల్ అయ్యి, చివరకు చంద్రబాబుకే వరం అవుతుంది. జగన్ చేసిన పనులు అన్నీ గమినిస్తే ఇదే అర్ధమవుతుంది. అయితే మా అధినేతే అన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ వెళ్తుంటే, మేము ఎన్ని సెల్ఫ్ గోల్స్ వెయ్యాలి అని అనుకున్నారో ఏమో కాని, జగన్ పార్టీ నేతలు కూడా వాళ్ళ నాయకుడు లాగా సెల్ఫ్ గోల్స్ వెయ్యటం నేర్చారు.
నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన సర్వే బృందాన్నే పోలీసులకు అప్పగించి, అతి పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అక్కడ కొంత మంది ఎన్నికల సర్వే చేస్తుంటే, అక్కడ టీడీపీ తరపున సర్వే చేస్తున్నారని అనుమానించిన వైసీపీ నేతలు, ఆ ముగ్గురిని పట్టుకుని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. తరువాత ఇదే విషయం లోటస్ పాండ్ కి తెలియ చేసారు. అయితే వాళ్లు తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంపిక పై సర్వే చేస్తున్నారని, మన మనుషులనే పట్టించారు కదా అని పై నుంచి అక్షింతలు పడ్డాయి. దీంతో, ఈ సర్వే చేస్తున్నది వైసీపీ బృందం అని తెలుసుకుని వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి షూరిటీ పై వారిని విడిపించుకెళ్లారు వైసీపీ నేతలు.
అయితే దీని వెనుక వైసీపీ నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి. నిజానికి ఇది ఎన్నికల సీజన్ కావటంతో, అందరూ సర్వేలు చేస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం నేతలు సర్వే పేరుతో ఎక్కడన్నా కనిపిస్తే, రచ్చ రచ్చ చేసి, వారిని అరెస్ట్ చేసే విధంగా చెయ్యాలని జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. చంద్రబాబు ఇలా సర్వే చేపిస్తూ, వారికి అనుకూలంగా లేని వారి ఓట్లు తీయిస్తున్నాడు అంటూ హడావిడి చెయ్యాలని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం, మొన్న విశాఖలో ఇలాగే హడావిడి చేసింది వైసీపీ. ఇదే కోవలో, విజయవాడలో సెల్ఫ్ గోల్ వేసుకుంది వైసీపీ. సొంత పార్టీ నేతలే సర్వే చేస్తుంటే, వారు తెలుగుదేశం వారు అనుకుని, వాళ్ళని నాలుగు తన్ని పోలీసులకు అప్పచెప్పారు. చివరకు మనం వేసుకుని సెల్ఫ్ గోల్ అని గ్రహించి, వెళ్లి విడిపించుకుని వచ్చారు.