రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'జియో అమరావతి మారధాన్ రన్ ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నారు. డీప్ (డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రీవెన్షన్) ఆధ్వర్యంలో అమరావతి మారథాన్ రన్ విజయవాడ, ఇందిరా గాంధీ స్టేడియం నుండి ప్రారంభం కానుంది. మారథాన్ రన్ లో 21కె, 10కె, 5కె, 3కె పేరుతో వివిధ కేటగిరీల్లో నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు నగర ప్రముఖులు పలువురు ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అత్యంత అవసరమని, ఆరోగ్యం పై తీసుకునే జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు, రాజధాని ప్రాంతంలో గల అవకాశాలు ఈ మారథాన్ రన్ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతోనే "డీప్ సంస్థ పరుగు నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
విజయవాడ నగరంలో నిర్వహించనున్న అమరావతి మారథాన్ రన్ కు ఇప్పటికే 5వేల మందికి పైగా రిజిస్తేషన్ చేయించుకున్నారు. స్పాట్ రిజిస్టేషన్ సౌకర్యం కూడా ఉండటంతో పాల్గొనేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. రన్లో పాల్గొనే వారికి టీ షర్టు, గూడీ బ్యాగ్, టైమింగ్ చిప్, మెడల్, స్నాక్స్‌ను నిర్వాహకులు అందించనున్నారు.
రిజిస్టేషన్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : http://www.amaravatimarathon.run/registration.html