నిన్న చంద్రబాబు ఇచ్చిన కోటింగ్ కి, మోడీకి మరో సారి దిమ్మ తిరిగింది. రాష్ట్రానికి సాయం ప్రకటించేందుకు మోదీ ప్రభుత్వానికి చిట్టచివరి అవకాశం ఇచ్చేందుకు తలపెట్టిన ఈ దీక్షకు భారీ ఎత్తున ప్రతిస్పందన లభించింది. సార్వత్రిక ఎన్నికల ముందు విపక్షాల ఐక్యతను మరోసారి చాటిచెప్పేందుకు ఇది వేదికగా మారింది. గత నెల 19న కోల్‌కతాలో ఆమె ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి 23 ప్రతిపక్షాల నేతలు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం బాబు దీక్షకు కూడా వారంతా హాజరై మరోసారి తమ ఐకమత్యాన్ని చాటారు. ‘మోదీ హటావో, దేశ్‌ బచావో..’ అన్న నినాదాలకు కేంద్రమైంది. ఎన్డీయే పక్షాలు, ఒకటి రెండు తటస్థ పార్టీలు మినహా... మిగిలిన విపక్ష నేతలంతా నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.

modied 12022019

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు... అప్పట్లో రాజ్యసభలో ప్రధాని హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేసిన మన్మోహన్‌ సైతం దీక్షకు రావడం అందరినీ ఆకర్షించింది. ప్రధాని మోదీ గుంటూరు సభలో చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడాన్ని అందరూ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు చేపట్టిన దీక్ష దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని పార్టీలు, మోడీ ఏపికి చేసిన ద్రోహం గురించి చెప్పటంతో, మోడీ దేశ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. అంతే కాదు, మోడీ దిగజారుడు మాటలకు, చంద్రబాబు కూడా అదే స్థాయిలో వాయించారు. దీంతో మోడీ, షా లకు దిమ్మ తిరిగింది. వారు చెయ్యగలిగేది వ్యవస్థలను అడ్డు పెట్టుకుని సాదించటం. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈడీ ని రంగంలోకి దించారు.

modied 12022019

చంద్రబాబుని సాధించాలి అంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక పిల్ల కేసు ఓటుకి నోటు కేసు. అయితే ఇది తెలంగాణా ఏసిబి నుంచి, ఎప్పుడు ఈడీ చేతిలోకి వెళ్లిందో కాని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఇప్పుడు మరోసారి ఈడీని రంగంలోకి దించారు. కోడి కత్తి కేసు పై ఎన్ఐఏ చేతులు ఎత్తేయటంతో, ఇప్పుడు ఈ కేసు పట్టుకుని చంద్రబాబుని ఎలా అయినా దీంట్లో దోషిగా చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం. మరో పక్క ఈ రోజు వేం నరేందర్‌రెడ్డి ఈ కేసు విషయంలో ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ ఈడీ ఎందుకు విచారిస్తుందో అర్థం కావట్లేదన్నారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. తన పిల్లల్ని కూడా విచారణకు పిలిచి వేధిస్తున్నారని నరేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read