సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడం, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేల చొప్పున ఆర్థికసాయం.. ఇలా వివిధ వర్గాలపై ఇటీవల వరాలజల్లు కురిపించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే బాటలో రైతాంగాన్ని ఆదుకునేందుకు భారీ పథకాన్ని ప్రకటించింది. రైతుల ఆర్థిక వెసులుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో భారీ పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలపై కేబినెట్‌లో చర్చించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా ఆ పథకం విధివిధానాలపై చర్చించి ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చేదానితో కలిపి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.

farmer 1322019

అలాగే ఖరీఫ్‌, రబీలో రెండు దఫాలుగా ఒక్కో సీజన్‌కు రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ, రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా త్వరగా చేపట్టాలని.. కుటుంబానికి రూ.10వేలు ఇస్తే మొత్తంగా రూ.7,621కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు. అలాగే వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. కేంద్రం పథకంలో అనేక ఆంక్షలు ఉన్నాయని.. 5 ఎకరాల లోపు వారే అర్హులుగా, మూడు వాయిదాలలో చెల్లించే విధంగా, కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసిందని, కానీ తాము రైతులు అందరికీ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే అర్హులకు మాత్రమే కాకుండా, మిగిలిన రైతులకు కూడా ఈ సహాయం అందనుంది.

farmer 1322019

అసలు రైతులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలుచేయాలని మొదట భావించినా.. కష్టాల్లో ఉన్న రైతుల్ని వెంటనే ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరానికి రూ.5000 చొప్పున ఇప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చే 2 వేలకు తోడు, 3 వేలు రాష్ట్రం ఇచ్చి, మొత్తం 5 వేలు ఇప్పుడే ఇస్తారు. కేంద్రం ఇచ్చే పధకం అర్హులు కాని వారికి, 5 వేలు మొత్తం రాష్ట్రమే భరిస్తుంది. ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది. కేంద్రం ఇచ్చే పధకం ద్వారా, 53 లక్షల మంది మాత్రమె అర్హులు అవుతారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read