కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రాకాష్ రెడ్డి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. విజయవాడలో నిన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు కోట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కోట్ల కూడా తన సన్నిహితులతో పార్టీ మారే విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. కర్నూలులో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.

kotla 24012019 2

మరో పక్క, గ‌త కొన్నాళ్లుగా ఈయ‌న వైసీపీలో వెళ్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేత‌ల నుంచి కూడా సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈయ‌న కోసం ఓ ప్ర‌త్యేక ప‌ద‌విని సైతం ఏర్చి కూర్చి పెట్టార‌ని, ఈయ‌న కోసం కొంద‌రిని కూడా వ‌దులుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, ఇటీవ‌ల జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌ర్నూలుకు చేరుకున్న స‌మ‌యంలో కోట్ల ఇక జ‌గ‌న్ పంచ‌న చేరి పార్టీ జెండా మారుస్తార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఇదేమీ జ‌ర‌గ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న ప్ర‌త్యామ్నాయంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

kotla 24012019 3

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎంతోమంది నేతలు వీడినా.. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో సీఎంగా ప‌నిచేసిన కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి అప్ప‌ట్లో వైఎస్‌తో విభేదించేవారు దీనిని దృష్టిలో పెట్టుకున్న కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి తమ తండ్రితో పోరు సల్పిన వై.ఎస్‌ కుటుంబం కంటే..టీడీపీలో చేరితేనే బాగుంటుందని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. శుక్రవారం కోట్ల అనుచరులు, కార్యర్తల సమావేశం ఏర్పాటు చేశారట. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. అనుచరుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాలనుకుంటున్నారట. అయితే సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమనే ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కొందరు బహిరంగంగానే చెబుతున్నారట. వైసీపీ నేతలు కూడా కోట్లకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read