విశాఖ మన్యంలో నెలకొన్న అంశాతికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణమని,ప్రశాంతంగా ఉన్న మన్యంలో అజ్యంపోసి తన తండ్రి, సోమ మృతికి కారణమ్యయ్యారని మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. పాడేరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. విశాఖలో జెడ్పీ సమావేశ వేదిక వద్ద మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావులను కోల్పోవడానికి సీఎం చంద్రబాబు కంటే పవన్ కల్యాణే బాధ్యత వహించాలన్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పతే కనీసం పరామర్మకు రాలేని మీరా మన్యం గిరిజనుల గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.

kidari 25012019

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాక్సైట్ తవ్వకాల జీవోను నిలిపివేశారని, మా నాన్న బతికి ఉన్న సమయంలో కూడా బాక్సైట్‌కు వ్యతిరేకంగానే గళమెత్తారన్నారు. ఏజెన్సీలో నిరుద్యోగులకు జాబ్‌మేళా, యువ శిక్షణ, నిరుద్యోగ భృతి అందించి గిరిజన యువతి పక్కదారి పట్టకుండా చూస్తున్నామన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పవన్ కల్యాణ్ లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారనే విషయాన్ని గిరిజనులంతా గుర్తించాలని కోరారు. ఎన్నికల వేళ బాక్సైట్ విషయాన్ని గుర్తు చేసి గిరిజనులను రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, టీడీపీ హయాంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరపబోమని మంత్రి శ్రావణ్‌కుమార్ స్పష్టం చేశారు.

kidari 25012019

ఇక బాక్సైట్ తవ్వకాలపై చాలా పోరాటం చేశామని శ్రవణ్ ఎండను సైతం లెక్కచేయకుండా బాక్సైట్ మైనింగ్ అడ్డుకున్నామని గుర్తు చేశారు. మన్యం ప్రాంతంలో మైనింగ్ జరగకుండా నేటికీ పోరాడుతూనే ఉన్నామన్న శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ కు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం జనసేన ని కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపితే ఒకవేళ ఎవరైనా మైనింగ్ చేస్తే ఆ ప్రాంతానికి వెళ్లి అందరం కలిసి ధర్నా చేద్దామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతే తప్ప అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని వసతులు కల్పించి అటవీ హక్కుల ద్వారా లభించే ప్రయోజనాలు సైతం అందేలా చూడాలని మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తానికి గిరిజనుల కోసం నిన్న మాట్లాడిన ప్రతి అంశానికి క్లారిటీ ఇస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చి కిడారి పవన్ కి ధీటుగా సమాధానం చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read