ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లిలో సుడిగాలి పర్యటన చేపట్టారు. సాయంత్రం సుమారు గం. 4.30 సమయంలో ప్రత్యేక విమానంలో ఢిల్లిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయన, విమానాశ్రయం నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎక నమిక్‌ ఫోరం కార్యక్రమంలో ప్రసంగించారు. ముందుగా ఏపి భవన్ నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది అనుకున్నా, సమయం మించిపోవటంతో, చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడారు. సంక్షోభంలో పడిపోయిన వ్యవ సాయానికి సేంద్రీయ సాగే పరిష్కారమని తెలిపారు. వాతావరణ మార్పులు, రసాయన ఎరువుల కారణంగా సాగు ఖర్చు పెరిగిపోవడంతో అంతర్జాతీయంగా వ్యవ సాయం సంక్షోభంలో పడిపోయిందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఖర్చు లేని సేంద్రీయ సాగు పద్ధతి)ని తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సహజసిద్ధ సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల సంఖ్య 27 లక్షలుగా ఉందని, ఇది మొత్తం వ్యవసాయంతో పోల్చి చూస్తే కేవలం 0.5 శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు అన్నారు.

గత 2 దశాబ్దాలుగా సేంద్రీయ సాగు పద్ధతులు అవలంబించే రైతుల సంఖ్యలో పురోగతి చాలా నెమ్మదిగా జరుగుతోందని, ఇందుకు కారణాలను విశ్లేషిస్తే.. రైతులు రసాయన ఎరువులకు అలవాటుపడిపోవడం, ప్రభుత్వం, సమాజం నుంచి తగినంతగా మద్ధతు లభించకపోవడం, అలాగే ఈ విధానంపై సరైన అవగా#హన లోపించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం ఈ అడ్డంకులు, అవరోధాలను అధిగమించిందని, కేవలం మూడేళ్లలోనే సేంద్రీయ వ్యవసాయ విధానం వాటాను మొత్తం వ్యవసాయంలో 8 శాతానికి పెంచగల్గిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని ఈ తరహా వ్యవసాయం చేస్తున్నారన్నారు. 2024 నాటికి మొత్తం రైతులందరినీ స#హజ సిద్ధ వ్యవసాయ విధానం వైపు మళ్లించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. డా. సుభాష్‌ పాలేకర్‌ నేత త్వంలో ఈ మేరకు అవగా#హన, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ చిత్తశుద్ధి, 5,600 మంది అనుభవజ్ఞులైన రైతులు, 1,06,991 స్వయం సహాయక బృందాలు ఆంధ్రప్రదేశ్‌ జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ కి మూలస్తంభాలుగా నిలిచి లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ సమావేశంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి కనబర్చాయి. ఇండోనేషియా మంత్రి లుహూత్‌ ఏపీ అనుసరిస్తున్న సేంద్రీయ సాగు విధానాన్ని తమ దేశంలోనూ అనుసరిస్తామని చెప్పారు. గ్రీన్‌ ్లకమేట్‌ ఫండ్‌ సంస్థ సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రెసిడెంట్‌ పవన్‌ సుఖ్‌దేవ్‌ ఏపీ ప్రభుత్వానికి నేల స్వభావం, వాతావరణం అంశాలపై స#హకరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఐసీఆర్‌ఏఎఫ్‌ (వరల్డ్‌ ఆగ్రోఫారెస్ట్రీ సెంటర్‌) శాస్త్రీయ సహాయం అందించేందుకు ముందుకు రాగా, ఇంటర్నేషనల్‌ నైట్రోజన్‌ ఇనీషియేటివ్‌ ఛైర్మన్‌ మార్క్‌ సుట్టన్‌ గ్లోబల్‌ లకమేట్‌ రీసెర్చ్‌ ఫండ్‌ దక్షిణాసియా #హబ్‌ ఏర్పాటు కోసం 20 మిలియన్‌ అమెరికా డాలర్లు కేటాయిస్తామని తెలిపారు. సేంద్రీయ విధానంలో భాగస్వామిగా ఉన్న బీఎన్పీ పరిబాస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. సేంద్రీయ సాగుపై పరిశోధన కోసం అమరావతిలో గ్లోబల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సంస్థ సేంద్రీయ సాగుపై సమాచారం, అధ్యయనం, సరికొత్త సేంద్రీయ విధానాలపై పరిశోధనలు చేస్తుందని, సరికొత్త ఆవిష్కరణలతో సేంద్రీయ సాగును మరింత అధునాతనంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read