పేదవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటే, ఆ రోజే నిజమైన పండుగ.. ఈ రోజు ఏపిలో అదే పరిస్థితి నెలకొంది... ముఖ్యంగా పల్లెటూరుల్లో సందడి వాతావరణం నెలకొంది.. అటు డ్వాక్రా మహిళలు, ఇటు వృద్దులు, వికాలంగులు, ఒంటరి మహిళలు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకుంటే, ఈ రోజు వారికి చంద్రబాబు ప్రకటించిన వరాలు చేతికి అందుతున్నాయి.. పల్లెటూరుల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు కంటే, ఎక్కువ లబ్దిదారులు ఉన్నారు. ఎక్కడ చూసినా, బోజనాలు, కొత్త బట్టలు పెట్టి మరీ, పెంచిన పెంచన్లు ఇస్తూ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకమ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 3రోజుల పాటు రాష్ట్రమంతటా పెన్షన్లు, పసుపు కుంకుమ పేరుతో సందడి చేస్తోంది.
ప్రభుత్వం పెన్షన్లను రెట్టింపు చేసింది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా మెరుగైన జీవనోపాధి పొందటానికి, ప్రతి కుటుంబం నెలకు రూ. 10 వేలు ఆదాయం పొందడానికి ప్రతి మహిళకు డ్వాక్రా, మెప్మాల ద్వారా రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేయబోతున్నారు. పెన్షన్‌ల సొమ్మును ప్రభుత్వం రెట్టింపు చేసింది. జనవరి నుంచే ఇది అమలులోకి వస్తుందని ప్రకటించారు. జనవరిలో పెంచిన రూ. వెయ్యితో పాటు, ఫిబ్రవరిలో ఇచ్చే రూ. 2 వేలు కలిపి ఒక్కొక్కరికి రూ. 3వేలు ఇస్తారు. దివ్యాంగులకు అవయవలోపాన్ని దృష్టిలో ఉంచుకొని అదే తరహాలో రెట్టింపు చేశారు. బ్యాంకర్లతో చర్చించి నగదు సిద్ధం చేశారు. లబ్ధిదారులకు రూ.3వేల చొప్పున పంపిణీ చేయడానికి రూ.2వేల నోటు ఒకటి, రూ.500 నోట్లు రెం డు ఇచ్చే విధంగా బ్యాంకర్లు నగదును ఎం పీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేశారు.
ఈ నెల 2 నుంచి పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా, మెప్మా మహిళలకు ఇచ్చే చెక్కులు ఇప్పటికే మండల, మున్సిపల్ కేంద్రాలకు చేరాయి. పెన్షన్, పసుపు కుంకుమ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సందేశంతో కూడిన లేఖను అధికారులు అందజేయబోతున్నారు. ఈ లేఖలు ఇప్పటికే ఆయా కార్యాలయాలకు చేరాయి. అక్కడి నుంచి పంపిణీ కేంద్రాలకు త రలిస్తున్నారు. గ్రామాలలో పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులు, గ్రామోద్యోగులు పంపిణీ ఏర్పాట్లను చేపట్టారు. మున్సిపల్ కేంద్రాలు, నగరపాలక సంస్థలో బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది వీటిని అందజేస్తున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. తొలిదశలో జి ల్లా సమాఖ్యలో పని చేస్తున్న సుమారు 10 - 15 మందికి వీటిని అందజేస్తారు. డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్‌ఫోన్లు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.