వార్నీ... నిన్న పార్లమెంటులో 5 లక్షల వరకూ ఇన్కం ట్యాక్సు లేదని చెప్పగానే మోదీగారితో సహా అరగంటసేపు బల్లలు చరుస్తూ టేబుళ్లు ఇరగ్గొట్టేంత హంగామా చేశారు. వాళ్ల హడావుడి చూసి నిజంగా మోదీగారు ఐదేళ్లలో మొదటిసారి జనానికి ఏదో మేలు చేస్తున్నారేమోనని అందరూ తెగ ఆనందపడిపోయారు. పార్టీలకు అతీతంగా అందరూ కొంచెం సేపు మోడీని అభినందించారు. తీరా చూస్తే మరోసారి జనం చెవిలో పువ్వులు పెట్జారని బోధపడింది. అసలు 5 లక్షల ఆదాయం దేశంలో ఎంతమందికి ఉందండీ? దీంతో పేద, మధ్యతరగతి జీవులకు ఏరకంగా లాభమో చెప్పండి? పోనీ కాస్త సంపాయించుకునేవాళ్లకైనా మేలు జరిగిందేమోనని చూసుకుంటే... 5 లక్షలు దాటి వంద రూపాయలు ఎక్కువైనా ఆ ఐదు లక్షలక్కూడా చచ్చినట్లు ట్యాక్సు కట్టాల్సిందేనంట.
కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో వేతనజీవులకు గొప్ప ఊరటగా పేర్కొంటున్న "ఆదాయపుపన్ను మినహాయింపు పరిమితి పెరుగుదల"లో మతలబు ఉందంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఈ ప్రకటనను పరిశీలిస్తే... పన్నుకు అర్హమైన సంవత్సరాదాయం రూ.5 లక్షల వరకు ఉంటే ఆదాయపుపన్ను చెల్లించవలసిన అవసరం లేదని పైకి కనిపిస్తున్నప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే అందులోని మతలబు బోధపడుతుందంటున్నారు. ఆర్థికమంత్రి గోయల్ ప్రకటన ప్రకారం పన్నుకు అర్హమైన వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా పన్ను మినహాయింపు వస్తుంది. ఈ రూ.5 లక్షల పరిమితి దాటినట్లయితే ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను రేటు స్లాబ్ ప్రకారమే పన్ను వసూలు చేస్తారు.
ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.6 లక్షలుగా ఉంటే, ఆ పై లక్ష రూపాయలు మాత్రమే పన్నుకు అర్హమైన ఆదాయం అనుకుంటే పొరపాటు. అప్పుడు ప్రస్తుత స్లాబ్ ప్రకారం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షికాదాయం వరకూ 5 శాతం పన్ను (రూ.12,500), ఆ పైన ఉన్న మిగిలిన లక్ష రూపాయల మొత్తానికి 20 శాతం (రూ.20,000) మొత్తం రూ.32,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఇప్పటికీ రూ.2.5 లక్షలుగానే ఉంది. బీజేపీ వేసిన జూమ్లాలో ఇది ఒకటి. ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళని ఎలా అయినా బకరాలను చెయ్యచ్చు అనుకునుటుంది బీజేపీ పార్టీ.