ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త రాష్ట్రం వస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి కేసులతో వేధించుకుని తింటున్నారని మండిపడ్డారు. దక్షిణాది నుంచి ఒక్క కేంద్ర మంత్రి అయినా మోదీ కేబినెట్ లో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక్క లీడర్ లేరని, ఉన్న ఒక్క వెంకయ్యనాయుడిని కేబినెట్ నుంచి పంపేశారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుంచి పక్కన పెట్టారన్నారు. దక్షిణ భారత నేతలకు ఏం గౌరవం ఇచ్చారో బీజేపీ చెప్పాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

venkayya 01022019

చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ..‘వెంకయ్య నాయుడు దక్షిణాది నుంచి ఒకే ఒక కేంద్ర మంత్రిగా ఉండేవాడు. ఆయన అన్ని రాష్ట్రాలకు తిరిగేవాడు. ఆయన్ను కూడా పదవి నుంచి తీసేసి ఉప రాష్ట్రపతిని చేసేశారు. ఎంత అసూయ అధ్యక్షా.. పాపం వెంకయ్య నాయుడు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చారో, లేక పనిష్మెంట్ ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలి. దక్షిణాది నుంచి ఒక్కరైనా కేంద్ర మంత్రి ఉన్నారా? దత్తాత్రేయ ఉంటే ఆయన్ను తీసేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాది వ్యక్తికి ప్రధాని పదవి పోతే, దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇచ్చి బ్యాలెన్స్ చేసేవారు’ అని చెప్పారు.

venkayya 01022019

చంద్రబాబు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వేళ, బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. "గుజరాత్ కు వెళ్లి చూడవయ్యా... కంపేర్ చెయ్యి... కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసిది పోయి, సిగ్గు వదిలిపెట్టి, మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? రోషం లేదా మాకు" అన్నారు. ఈ సమయంలో 'అబ్జెక్షన్' అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా..? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు" అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read