ఆటోల పై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పెద్దసంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆటోవాలాలకు ముఖ్యమంత్రి మరిన్ని వరాలు కురిపించారు. ఆటో డ్రైవర్ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణంలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు.
ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఆటోడ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటాన్నారు. ‘ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి.. మీ క్షేమం నేను చూసుకుంటాను’ అని వారితో సీఎం అన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ. ‘మీరు ఎలాగైతే ముందుండి ప్రేక్షకుల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తారో అదే మాదిరిగా తాను కూడా అదరికి అండగా ఉంటూ డ్రైవర్ లా ముందుండి రాష్ట్రాన్ని ముందుకు చేరుస్తానని’ అన్నారు. ఆటొ డ్రైవేర్స్ అందరికీ తాను అన్నగా ఉంటానని వారి కష్టాలు తనకి తెలుసని ఈ సంధర్బంగా మూడు చక్రాల మోటార్ వెహికిల్ ట్యాక్స్ ని రద్ధు చేస్తునట్టుగా ప్రకటించారు. ఇది కేవలం మోదటిదే అని మున్ముందు ఇంకా చాలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారిని ఇంకా కూడా ఎమ్పౌఏర్ చేయాలనే భావనా తనకి ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న 3,75,000మంది ఆటో డ్రైవర్లకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని.. ఇందుకోసం ఆటో డ్రైవర్స్ అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడాలని చంద్రబాబు సూచించారు. ఈ 3,75,000 మంది ఆటో డ్రైవర్లు ఆటో వెనకాల ‘థాంక్యూ సీఎం’ అని రాయించుకోవాలని.. టీడీపీ జెండా పెట్టాలని అన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుందని అప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా వాటినే వాడుతారని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చునని.. విద్యుత్ బిల్లు విషయంలో ఆటో డ్రైవర్లకు కొంత మినహాయింపునిచ్చే విషయం కూడా ఆలోచిస్తామని చెప్పారు. టీడీపీ అంటేనే పేదల ప్రభుత్వం అని.. పేదవాళ్ల కళ్లలో ఆనందం చూడాలన్నదే తన కోరిక అని అన్నారు. ఈ ట్యాక్స్ రద్ధు వల్ల 140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినప్పటికి ఆటో డ్రైవర్ల కష్టమే తనకి ముఖ్యమని ఈ నిర్ణయం తిస్కున్నానని ఆయన వెల్లడించారు.