ఏపీకి విభజన హామీలను అమలుచేయాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ, శాసనమండలిలో తీర్మానం చేసింది. అయితే ఈ ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియా సమావేశంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తీర్మానం కాపీలను చింపేశారు. లోపభూయిష్టమైన తీర్మాన కాపీలుగా ఆరోపిస్తూ చింపేశారు. కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకున్నామని.. కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభం అవుతాయని.. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సొంత నిర్మాణాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ విషయంలో సహకారం లభించలేదని, మిగతా అన్నీ ఇచ్చేసామని, లక్షల లక్షల కోట్లు ఇచ్చామని అన్నారు.

veerraju 01022019

ఏపీకి విభజన హామీలు అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసిన ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపడంపై మంత్రి లోకేష్ స్పందించారు. ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయమని తీర్మానం చేస్తే.. ఆ కాపీలను బీజేపీ ఎమ్మెల్సీలు చించేస్తారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణను చీల్చినట్లు కాపీలను చించేశారని వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి అక్కర్లేదన్న మంత్రి లోకేష్. అన్యాయం జరిగిన రాష్ట్రంగా బడ్జెట్ లో కనీసం రాష్ట్ర ఊసేలేదని.. అమలుచేయాల్సిన హామీలపై కేంద్రానికి అసలు చిత్తశుద్దే లేదన్నారు.

veerraju 01022019

రాష్ట్రంపై అన్యాయం జరిగిందని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ ప్రతులను బీజేపీ నేతలు చింపేస్తారా? బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేదని మరోసారి స్పష్టమైందన్నారు. అంతకు ముందు శాసనమండలి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. డొక్కా వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లు ఛైర్మన్ పోడియం దగ్గరకు దూసుకురాగా.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ రంగంలోకి దిగారు. సభ్యులకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్ధుమణిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read