ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కోస్టల్ బ్యాంకు చైర్మన్‌‌గా, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేతగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది. హైవే పక్కన రోడ్డుకు దిగువలో ఓ కారు ఉండటాన్ని తెల్లవారుజామున కొందరు స్థానికులు గుర్తించారు. ఏం జరిగిందో చూద్దామని వెళ్లి చూస్తే కారు వెనుక సీట్లో మృతదేహం కనిపించింది. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని, ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు జయరామ్‌గా గుర్తించారు. జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా? లేక హత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు టోల్‌గేట్ల దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌‌లను పోలీసులు సేకరించారు. అయితే కారు డ్రైవర్ ఏమయ్యాడని పోలీసులు ఆరా తీస్తున్నారు.

express 0140202019 1

హైదరాబాద్ నుండి విజయవాడకు ఈయన వెళుతున్నారు. ఫిబ్రవరి 01వ తేదీన శుక్రవారం నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారి పక్కనే కారులో ఇతని డెడ్ బాడీ లభ్యమైంది. ఇతను ఎలా చనిపోయారనే దానిపై క్లారిటీ లేదు. కానీ పక్కా హత్య అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిగురుపాటి తలపై రక్తపు మరకలుండడం, కారు వెనుక భాగంలోని సీటు కింద డెడ్ బాడీ పడి ఉండడం...కారుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఇలా అనేక డౌట్స్ వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు...కారులో మద్యం సీసాలు కూడా ఉన్నాయి. కారులో డ్రైవర్ ఉంటే ఎక్కడున్నాడనే సమాచారం లేదు. సూర్యాపేట, చిల్లకల్లు చెక్ పోస్టు సెంటర్లలో సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

express 0140202019 1

ఇక చిగురుపాటి జయరామ్ విషయానికి వస్తే...ఇతను సౌమ్యంగా ఉండే వ్యక్తి..అని తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్ టీవీ ఛానెల్ నడిపే సమయంలో పార్ట్‌నర్‌తో విబేధాలున్నాయా ? లేక ఇతర వ్యాపారాల్లో అనేది తెలియాల్సి ఉంది. కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీగా సుపరిచితుడు. గుంటూరు జిల్లా తెనాలీలో ఈయన జన్మించారు. ఇతను అమెరికన్ పౌరుడు. ఫ్లోరిడాలో ఆయన భార్య..పిల్లలు నివాసం ఉంటున్నారు. అక్కడ ఓ బ్యాంకులో భాగస్వామి అని తెలుస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించిన చిగురుపాటి అతి కొద్దికాలంలో పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. అనేక కంపెనీలను స్థాపించి వ్యాపారరంగంలో రాణించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read