ఎప్పుడూ గోధుమ రంగు, పసుపు రంగు కాకుండా వేరే రంగు చొక్కా వెయ్యని చంద్రబాబు, వేరే రంగు చొక్కా వెయ్యటం ఇదే మొదటిసారి. మోడీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి నలుపు రంగు వేసి నిరసన తెలుపుతున్నారు. ఈ నలుపు మోదీ పై రగులుతున్న ప్రతి ఆంధ్రుడి నిరసనకి ప్రతీక. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. త్యేకహోదా, విభజన హామీల సాధన సమితి నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావంగా నల్లచొక్కా ధరించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా ప్రయోజనాలు, విభజన హామీల సాధన కోసం చేస్తున్న ధర్మపోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది.

black 01022019 2

ఫిబ్రవరి 11న సహచర మంత్రులతో కలిసి అక్కడ ఒక రోజు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించారు. మర్నాడు 12న రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను అఖిల పక్ష నేతలు కలిసి రాష్ట్రానికి జరిగిన అ న్యాయాన్ని వివరిస్తారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రూపాల్లో రాష్ట్రంలో నిరసనలు సాగించాలని సీఎం పిలుపిచ్చారు. దీనికోసం అఖిలపక్షం తరపున కమిటీ వేయాలని నిర్ణయించారు. 1వ తేదీన రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని, 11న ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించా రు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం తెలిపారు.

black 01022019 3

‘రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ ఆందోళనల్లో 5 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేయాలి. అన్ని వర్గాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తే అది గొప్ప ప్రజాఉద్యమంగా మారుతుంది. దీనిని రాజకీయ పోరాటంగా భావించకూడదు. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే ఈ ఉద్యమాన్ని తీసుకోవాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఆంధ్రతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీ పెద్దల్లో కలగాలి’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనకు నేను చేయాల్సిదంతా చేశాను. హోదా చట్టంలో అంశాల అమలుకు విశ్వప్రయత్నాలు చేశాం. చివరకు రెవెన్యూ లోటు భర్తీకి కూడా ఇంతవరకు సరిగా నిధులివ్వలేదు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.4,000 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read