కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సూర్యప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కోట్ల పార్టీ మారుతున్నారన్న సమాచారంతో కర్నూలులోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. సూర్యప్రకాశ్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోట్ల తెదేపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును ఆయన ఈరోజు కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

kotla 28012019

కోట్ల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి భోజనానికి ఆహ్వానించారని.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుని ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈభేటీకి తన సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రను కోట్ల తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తన సన్నిహితులు, కుటుంబసభ్యులు తెదేపా తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

kotla 28012019

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎంతోమంది నేతలు వీడినా.. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో సీఎంగా ప‌నిచేసిన కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి అప్ప‌ట్లో వైఎస్‌తో విభేదించేవారు దీనిని దృష్టిలో పెట్టుకున్న కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి తమ తండ్రితో పోరు సల్పిన వై.ఎస్‌ కుటుంబం కంటే..టీడీపీలో చేరితేనే బాగుంటుందని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read