హైదరాబాద్ లో ఉండే కొత్త స్నేహితులు ఇద్దరూ, అమరావతిని నాశనం చెయ్యటానికి, ఏపిలో అడుగు పెడుతున్నారు. ఇంతకీ ఎవరూ వారు అనుకుంటున్నారా ? సింపుల్ ఏపి ద్రోహులు, అమరావతి పై విషం చిమ్మే వారు.. వల్లే కేసీఆర్, జగన్. కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చేనెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ పొలిటికల్ స్వామీజీ బ్రోకరేజ్ చేస్తేనే, జగన్, కేసీఆర్ ఒక్కటయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తా..
కేసీఆర్ ఏపి కి వెల్తున్న వేళ వైసిపి అధ్యక్షుడు జగన్ గుంటూరులో గృహప్రవేశం చేస్తున్నారు. అదే 14న జగన్ తన గృహ ప్రవేశం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నుంచి, కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తారని వార్తలు వచ్చాయి. కేటీఆర్ కూడా కేసీఆర్ అమరావతి వెళ్లి జగన్ తో భేటీ అవుతారు అన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏపి పర్యటన 14న ఉండటం, అదే రోజు జగన్ గృహ ప్రవేశం చెయ్యటంతో, కేసీఆర్ ఇక్కడకు కూడా వస్తారని సమాచారం. లోటస్ పౌండ్ లో జగన్ ని కలిసిన కేసీఆర్ ఏపికి వెళ్లి జగన్ తో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరుపుతారని ఇప్పటికే ప్రకటించారు. అయితే కేసీఆర్ ఎప్పుడు ఏపికి వెల్తారన్న దానిపై ఇప్పటివరకు క్లారిటి లేకపోయినా త్వరలో విశాఖకు కేసీఆర్ వెల్తుండటంతో జగన్ ను కలుస్తారనే చర్చ జరుగుతుంది.
రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ తో చేతులు కలిపి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడంటూ జగన్ పై, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశాయి అధికార, విపక్ష పార్టీలు. అంతేనా… అధికార టిడిపి ఒకడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి పరుష పదజాలంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ అక్షరం పొల్లు పోకుండా ఏపీ ప్రజల ముందు ఆవిష్కరించి, విభజన సెంటిమెంట్ ని రెచ్చగొట్టింది. దాంతో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏపీలో పర్యటిస్తే అదెక్కడ తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుందో అని వైసీపీ నేతలు హడలి పోతున్నారట.