ఇది సినిమా హీరోల కోసం కాదు, కులం కోసం కాదు... జీవితంలో ఎంతో మందిని దాటుకుని, అన్నీ చూసి, జీవిత చరమాంకంలో, స్వచ్చమైన మనసుతో ఇచ్చే దీవెనలు అవి... ఆమె పేరు , ముత్యాలమ్మ.. చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టం చూసి, తన వంతుగా 50 వేల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది. మా అనంతపురం జిల్లాకు కృష్ణా నీళ్ళు ఇచ్చావ్, అమరావతి కడుతున్నావ్, మాకు పెన్షన్ లు ఇస్తున్నావ్, నాలాంటి ఎంతో మందిని ఆదుకుంటున్నావ్.. అందుకే నువ్వు నాకు ఇవ్వడం కాదు...నేనే నీకు రూ 50వేలు ఇస్తున్నా అంటూ ఆ అవ్వ, చంద్రబాబుకి 50 వేల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రం పై కుట్రలు, అమరావతిని హేళన చేస్తున్న మనుషులని గుర్తు చేసుకుని, ఆ అవ్వ స్పూర్తి మన అందరికీ మార్గదర్శం కావలి అంటూ, చంద్రబాబు ఆ అవ్వ కాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున పాదాభివందనం చేసారు.

cbn 29012019 1

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాననిఅన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటని తెలిపారు. అనంతపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా చేస్తానని ప్రకటించారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామన్నారు. సుపరిపాలనకు నాంది పలికినట్లు తెలిపారు. అలాగే 13 కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని వివరించారు. పోలవరం ద్వారా నీళ్లు కృష్ణానదికి వస్తాయన్నారు. ప్రతి సోమవారం నీరు- ప్రగతిపై సమీక్ష చేస్తున్నామని, నీరు- ప్రగతి వల్ల అనంతపురం జిల్లా లాభపడిందన్నారు. దేశంలోనే రెండో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం అని తెలిపారు. హంద్రీనీవాకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పుంగనూరు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటి విడుదల చేశామన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ హిందూపురం నుంచే పోటీచేసేవారని గుర్తుచేశారు.

cbn 29012019 1

వైసీపీ నేతలు చేయాల్సింది జలదీక్ష కాదని, కృష్ణా జలాల్లో స్నానాలు చేసి పాపాలు కడుక్కోవాలని సూచించారు. కియ కంపెనీతో 16 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రపంచానికే అనంతపురం పండ్లు పంపించే పరిస్థితి వస్తుందని వివరించారు. భవిష్యత్‌లో అనంతపురం నుంచి వలసలు ఉండవన్నారు. బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యత ఇచ్చామని, యువత వ్యవసాయం వైపు మొగ్గుచూపుతుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం ఎక్కడా జరగలేదన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసినట్లు చెప్పారు. పోలవరం పనులకు గిన్నిస్ రికార్డ్ లభించిందని గుర్తుచేశారు. ఎన్ని అవార్డులు వచ్చినా మోదీకి కనికరం లేదని ధ్వజమెత్తారు. 2019లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడా లేదని, భవిష్యత్‌లో కూడా రాదన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ద్వారా సీమకు నీళ్లిచ్చామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read