ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరారీ ఆర్ధిక నేరగాడు, ప్రముఖ లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అనూహ్య రీతిలో విరుచుకుపడ్డారు. పరోక్షంగా విజయ్ మాల్యాను ప్రస్తావిస్తూ ప్రధాని లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలకు ట్విటర్ వేదికగా కౌంటర్ విసిరారు. నిజంగా ప్రజా నిధలను వసూలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రధానికి ఉంటే.. తాను చెల్లిస్తానని చెప్పిన డబ్బు తీసుకోవాలని భారత బ్యాంకులను ఎందుకు ఆదేశించడం లేదంటూ ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ తరపును బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నీ తిరిగి చెల్లించేస్తానంటూ ట్విటర్లో ఇవాళ ఆయన వరుస పోస్టులు పెట్టారు. ప్రధాని మోదీ చేసిన బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ విజయ్ మాల్యా గురించి పరోక్షంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

vijaymallya 140222019

దీంతో మాల్యా ఇవాళ ఉదయం ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘‘పార్లమెంటులో ప్రధానమంత్రి చివరి ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. ఆయన కచ్చితంగా మంచి మాటకారి. రూ.9 వేల కోట్లతో ఓ వ్యక్తి ‘‘పరారయ్యాడు’’ అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండా ప్రస్తావించారు. మీడియా చెబుతున్న దాన్ని బట్టి అది నా గురించేనని నాకర్థమైంది...’’ అని పేర్కొన్నారు. నిజంగా ఈ ప్రజాధనాన్ని వసూలు చేయాలని ఉంటే... తాను చెల్లిస్తానన్న సొమ్మును తీసుకోవాలని బ్యాంకులకు ప్రధానమంత్రి ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘కనీసం కింగ్ ఫిషర్‌కి అప్పుగా ఇచ్చిన ప్రభుత్వ నిధులను పూర్తిగా వసూలు చేసేందుకైనా ప్రధాని ఎందుకు ముందుకు రావడంలేదు? ఆ సొమ్మును తీసుకోమని బ్యాంకులకు ఎందుకు చెప్పడం లేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.

vijaymallya 140222019

తాను అప్పులు కట్టేస్తానని కర్నాటక హైకోర్టు ముందు కూడా ఆఫర్ చేశానని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ‘‘దీన్ని చిన్న విషయంలా తీసిపారెయ్యెద్దు. ఇది నేను స్పష్టంగా, నిజాయితీగా, నిష్కపటంగా చెబుతున్న మాట. అయితే ఇప్పుడు బంతి వేరే కోర్టులో ఉంది. వెంటనే బాకీ చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అయినా కింగ్ ఫిషర్‌కి అప్పుగా ఇచ్చిన డబ్బును బ్యాంకులు ఎందుకు స్వీకరించడం లేదు.?’’ అని ఆయన ప్రశ్నించారు. తాను అక్రమంగా ఆస్తులు దాచుకున్నట్టు ఈడీ చెబుతున్న విషయం మీడియా ద్వారా తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యానని విజయ్ మాల్యా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఒకవేళ దాచిన సొమ్ము అంటూ ఏదైనా ఉంటే రూ.14 వేల కోట్ల ఆస్తులను నేను బహిరంగంగా కోర్టు ముందు ఎందుకు పెడతాను? ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. అయినా నాకిది పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు...’’ అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో అమల్లోకి తెచ్చిన పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద... ‘‘పరారీ ఆర్థిక నేరగాడి’’ (ఎఫ్ఈవో)గా ప్రకటించిన తొలి వ్యక్తి విజయ్ మాల్యా కావడం విశేషం. రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేతపై విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన 2016 మార్చి 2న దేశం విడిచి లండన్ పారిపోయారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read