ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు.. దేశంలోనే అత్యంత ఉన్నతంగా రూపు.. అందరి దృష్టి మన వైపు.. అదే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఆశయం. సకల హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయం మన రాష్ట్రంలో.. అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించిన ఈ ప్రాజెక్టుకు తొలి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ పూర్తికావచ్చింది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది... గురువారం దిబ్బపాలెంలో విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునాదిరాయి పడింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా భోగాపురం విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన విజయనగరం జిల్లా భోగాపురం జిల్లా దిబ్బపాలెం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీని పర్యాటరంగంగా అభివృద్ధిచేస్తామని అన్నారు.

భోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు వెనుక తెదేపా ప్రభుత్వం చొరవ ఎంతో ఉంది. అప్పటి కేంద్ర విమానయాన శాఖామాత్యులుగా, విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలా భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. తొలుత 5300 ఎకరాల భూములు అవసరమని గుర్తించినా... పంటభూములు, నివాసాలు ఎక్కువగా పోతున్న నేపథ్యంలో 2.645 ఎకరాలకు పరిమితం చేశారు. ఇప్పటికే 2462 ఎకరాల భూములను సేకరించి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు పూర్తిచేశారు. ఇంకా మిగిలిన దాదాపు 183 ఎకరాల భూసేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో విమానాశ్రయంతో పాటు ఎయిరో సిటీ, విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమలు, అతిథి రంగం అభివృద్ధి ప్రభుత్వం సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను సిద్దం చేస్తోంది. ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతికి జీవగర్రగా నిలిచేలా... హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికంటే మిన్నగా దీన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సర్కారు ఉంది.

విమానాశ్రయానికి అడుగులు పడ్డంతో భోగాపురం పాంతంంలో అమాంతంగా భూమ్‌ ఏర్పడింది. గతంలో గజం రూ2వేల నుంచి రూ.3వేల వరకు పలికేది. ఎయిర్‌పోర్టు వస్తుందన్న ప్రకటన తర్వాత ఇక్కడి భూముల విలువ బాగా పెరిగింది. విశాఖ నగరానికి సమీపాన 45కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు గంట వ్యవధిలోనే చేరుకునేందుకు జాతీయ రహదారి అనుకూలంగా ఉంది. ఇక విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎకరానికి రూ.28 నుంచి రూ.33లక్షల వరకు పరిహారం ప్రభుత్వం చెల్లించింది. అంతంత మాత్రం పంటలు పండే భూములకు భారీగా పరిహారం అందడడంతో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ప్రభుత్వం అన్ని రకాల ప్యాకేజీలు ఇచ్చేందుకు ముందుకు రావడం నిర్వాసితులకు ఎంతో ఊరటనిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read