అమరావతి అంటే జగన్ కు ఎంత ఎలర్జీ అనేది అందరికీ తెలుసు. అమరావతి శంకుస్థాపనకు రాడు, అమరావతి అసెంబ్లీకి రాడు, అమరావతిలో సొంత పార్టీ సానుభూతి పరులైన రైతులు, భోజనానికి పిలిస్తే రాడు, ఆసలు అమరావతి అంటేనే కంపరం. ప్రజలు నిలదీస్తారని, ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు కాని, లేకపోతే అది కూడా ఉండదు. నాలుగు రోజులు పాదయాత్ర చెయ్యటం, హైదరాబాద్ లోటస్ పాండ్ లో రెండు రోజులు రెస్ట్ తీసుకుని, మళ్ళీ రావటం, ఇలా సాగంది పాదయాత్ర. పాదయాత్ర ముందు అయితే, గట్టిగా నెల రోజుల్లో, రెండు మూడు రోజులు మాత్రమె ఏపిలో ఉండేవాడు. అది కూడా ఉదయం ఫ్లైట్ కి వచ్చి, సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవటం. హైదరాబాద్ అంటే ఇష్టమో, లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమో కాని, జగన్ మాత్రం, టైం దొరికితే చాలు హైదరబాద్ లో వాలిపోతూ ఉంటారు.
దీని పై చంద్రబాబు నిన్న విలేకరులతో మాట్లాడుతూ స్పందించారు. ముగ్గురు మోదీలతో మనం పోరాడుతున్నమాని చంద్రబాబు అన్నారు. ఢిల్లీ మోదీ, తెలంగాణ మోదీ, ఏపీ మోదీలతోనే మన పోరాటమని, 90 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని ఆయన చెప్పారు. జగన్ పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లారని, అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. సీబీఐ కోర్టు ఏపీకి వస్తే అప్పుడు జగన్ అమరావతికి వస్తారేమోనన్నారు. ఆయానకు అమరావతిలో ఉండాటానికి బాధ అని అనంరు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొందరు ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో భూముల ధరలు పెరగడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. ప్రజలు బాగుపడితే వైసీపీకి కడుపు మంటని మండిపడ్డారు. కేంద్రం తీరుతో అందరిలో అసహనం పెరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విమానాశ్రయ భద్రత కేంద్రానిది కానీ, విచారణ.. దర్యాప్తు అధికారం రాష్ట్రానిదే. రాష్ట్ర సార్వభౌమ అధికారాన్ని ఎలా ధిక్కరిస్తారు. రాష్ట్ర పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయని వ్యక్తికి కేంద్రం ఎలా ఆశ్రయం ఇస్తుంది? వ్యవస్థలపై గౌరవం లేకపోతే పాకిస్థాన్, అమెరికా పోయి ఫిర్యాదు చేసి వస్తారా? రఫేల్ కేసు ఉందని సీబీఐని అస్తవ్యస్తం చేశారు. అందుకే సీబీఐకి సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నాం. అవినీతి ఆరోపణలు ప్రధానిపై లేవా? రఫేల్ మాటేమిటి? మీతో ఉన్నంత వరకూ మాపై దాడులు చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే అకస్మాత్తుగా అవినీతిపరులమైపోయామా? మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి పరులైపోయారా? నచ్చిన వ్యక్తులను కాపాడుకునే ప్రయత్నం ఇది’’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు.