సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారుల పై టోల్ గేట్లవద్ద రుసుములు రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. టోల్ గేటు సిబ్బంది వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోవడంలేదు. టోల్ వసూలు చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోల్ టేట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12 నుంచి 16 దాకా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద రుసుము వసూళ్లను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే ఈ ఆదేశాలను టోల్ సిబ్బంది పాటించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్ర రహదారులకే పరిమితమని ఎన్ఎస్ఐ నుంచి ఆదేశాలు వస్తేనే తాము పాటిస్తామని టోల్ ఫ్లాజా నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, కృష్ణా జిల్లా టోల్ ప్లాజాల వద్దకు పోలీసులని పంపించారు. ఏపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే అని, టోల్ ప్లాజా సిబ్బందికి గట్టిగా చెప్పారు. పోలీసులు దగ్గర ఉండి, వాహనాలను పంపిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, హైవే అథారటీ నుంచి ఆదేశాలు రావాలి అంటూ, ఆటలు ఆడుతూ ఉండటంతో, చంద్రబాబు ఏకంగా పోలీసులని పంపి, టోల్ సిబ్బందిని నిలువరించాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో ఏపి సర్కార్ దెబ్బకు టోల్ ప్లాజా సిబ్బంది దిగి వస్తున్నారు. కృష్ణా జిల్లాలో అన్ని టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము నిలిపివేశారు. కీసర, పొట్టిపాడు, చిల్లకల్లు, టోల్ ప్లాజాల వద్ద, టోల్ రుసుము నిలిపి వేసి, వాహనాలను వదులుతున్నారు. అయితే గుంటూరులో మాత్రం, ఇంకా టోల్ రుసుము తీసుకుంటున్నారు అనే సమాచారం వస్తూ ఉండటంతో, అక్కడకు కూడా పోలీసులను పంపిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, వారికి ఈ నాలుగు రోజులు, ప్రశాంతంగా సొంత ఊర్లకి వచ్చి, ఎక్కువ సేపు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, దీనికి కూడా నేషనల్ హైవె అథారటీ పర్మిషన్ కావాలంటూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, చంద్రబాబు పోలీసులని పంపి, సమస్య పరిష్కరించారు.