రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్లను అమాంతం పెంచిన చంద్రబాబు, ఇప్పుడు రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయం స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు చేతులు లేని దివ్యాంగులు ఇతరుల పై ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటారని చెప్పారు. రెండు చేతులు లేని దివ్యాంగులను గుర్తించాలని ఈ మేరకు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అయితే, ఈ ఉదయం జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో, చంద్రబాబుకు, విజయవాడ ఎమ్మల్యే గద్దె రామ్మోహన్ ఈ విషయం చెప్పినట్టు తెలుస్తుంది.

cbn pensions 12012019 2

చంద్రబాబు మాట్లాడుతూ "కేంద్రం మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఉంటే మరింత వెసులుబాటు ఉండేది. అడగడానికి వైకాపాకు మనసు రావడంలేదు. ప్రత్యేక హోదా గురించి వైకాపా మాట్లాడటంలేదు. హోదా అంటే మోదీకి కోపం వస్తుందని వారికి భయం. సీబీఐ కత్తి మెడపై ఉంది. టీఆర్‌ఎస్‌ సాయం తీసుకుని ప్రత్యేక హోదా సాధిస్తారట. ఇద్దరు మోదీలు, దిల్లీలో ఉండే మోదీ ముగ్గరూ కలిసి చెప్పాలి ఎప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారో. రాజకీయాలు చేయడం కాదు, పరిపాలనా అనుభవం లేని వారు ఉత్తుత్తి హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రూ.200లు పింఛను ఇచ్చి పదేళ్లు చెప్పుకున్నారు. మేం పదిరెట్లు పెంచాం. రైతులకు రుణమాఫీ సాధ్యం కాదన్నారు.. మేం చేసి చూపించాం. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. ఆదాయపన్నుశాఖ దాడుల గురించి ఎందుకు మాట్లాడరు. దేశమంతా ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది."

cbn pensions 12012019 3

‘‘ఆదాయం కోల్పోయిన జనాభాకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. విభజన చట్టంలో పెట్టిన అంశాలేవీ పట్టించుకోకుండా వదిలేశారు. రూ.75వేల కోట్లు రావాలని గతంలో పవన్‌ కల్యాణ్‌ లెక్కగట్టారు. ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన రూ.3వేల కోట్లు ఇంకా రావాలి. రైతు రుణ మాఫీ, పింఛన్లు ఇచ్చామని ఏపీకి రావాల్సిన లోటును కత్తిరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ సహకారం అందించలేదు. ఇంత చేస్తుంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read